ఈ మధ్యకాలంలో సినీ సెలబ్రిటీల మోడరన్ లైఫ్ స్టైల్ నే వారి పిల్లలు కూడా ఫాలో అవుతుండటం చూస్తున్నాం. ముఖ్యంగా బాలీవుడ్ లో పబ్స్, పార్టీస్, వీకెండ్ టూర్స్.. నైట్ అవుట్స్.. డేటింగ్స్ ఇలా ప్రతి ఒక్కరూ ఇదే ట్రెండ్ లో వెళ్తున్నారు. సరే సినీ నటుల వారసులు, వారసురాళ్లు కదా.. వారి పేరెంట్స్ నుండే ఆ కల్చర్ అలవాటు అయ్యిందేమో.. లేదా నెక్స్ట్ సినిమాల్లోకి వస్తారు కాబట్టి, ఆ మోడరన్ లైఫ్ అలవాటు చేసుకుంటున్నారేమో అనుకోవచ్చు. కానీ.. సినిమాలకు సంబంధం లేకపోయినా కొన్నిసార్లు కొంతమందిని చూసి ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. అలా అందరినీ పబ్స్, పార్టీస్, మోడలింగ్ తో సర్ప్రైజ్ చేస్తోంది సారా టెండూల్కర్.
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కుమార్తె.. ఈ సారా. లండన్ యూనివర్సిటీలో మెడిసిన్ చదువుతున్న సారా.. సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ.. ఇన్ స్టాగ్రామ్ లో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. అయితే.. లండన్ లో ఉంటోంది కాబట్టి.. అక్కడి కల్చర్ కి బాగా అలవాటు పడిపోయిందట సారా. రీసెంట్ గా సోషల్ మీడియాలో పాపులర్ అయిన ఓర్రీతో కలిసి నైట్ పార్టీలో సందడి చేసిందట. ప్రస్తుతం ఓర్రీతో కలిసి సారా చేసిన నైట్ పార్టీ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఓర్రీ ఎవరంటే.. అతని పూర్తిపేరు ఓర్హాన్ అవత్రమణి. బాలీవుడ్ స్టార్ కిడ్స్ కి మంచి స్నేహితుడు.
ఈ క్రమంలో అతనితో కలిసి సారా చిల్ అవుతున్న పిక్స్ చూసేసరికి సచిన్ ఫ్యాన్స్ తో పాటు సారా ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు. ప్రస్తుతం సారా – ఓర్రీల పార్టీ హల్చల్ పిక్స్ బాలీవుడ్ వర్గాలలో హాట్ టాపిక్ గా మారాయి. మరోవైపు ఓర్రీ.. కామన్ ఫ్రెండ్ అంటూ యంగ్ హీరోయిన్స్ జాన్వీ కపూర్, సారా అలీఖాన్, షనాయా కపూర్, నైసా దేవగన్ ఇలా అందరితో గతంలో పార్టీలో పాల్గొన్న పిక్స్ వైరల్ అయ్యాయి. ఇప్పుడు సారా కూడా అదే జాబితాలో చేరడం ఆశ్చర్యం కలిగిస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. సారా ఈ మధ్య మోడలింగ్ తో పాటు ఫ్యాషనిస్ట్ గా కూడా పిక్స్ షేర్ చేస్తోంది. చూడాలి మరి త్వరలో ఏదైనా గుడ్ న్యూస్ చెబుతుందేమో!