'సార్' బ్యూటీ సంయుక్త మేనన్ సరికొత్తగా కనిపించింది. చెప్పాలంటే ఫస్ట్ టైమ్ అలాంటి గ్లామర్ తో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం ఇది కాస్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇంతకీ ఏంటి విషయం?
రీసెంట్ టైంలో టాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న బ్యూటీ ఎవరా అంటే చాలామంది చెప్పే పేరు సంయుక్త మేనన్. మలయాళంలో ఎప్పటినుంచో యాక్ట్ చేస్తున్నప్పటికీ ఓ మాదిరిగా గుర్తింపు తెచ్చుకుంది. ఎప్పుడైతే ‘భీమ్లా నాయక్’తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిందో ఆమె లక్ మారిపోయింది. ఆ తర్వాత చేసిన ప్రతి సినిమాతోనూ హిట్ కొడుతూ ఆకట్టుకుంది. ఇప్పుడు సరికొత్తగా కనిపించి ప్రేక్షకులందరినీ మెస్మరైజ్ చేస్తోంది. ఇంతకీ సంయుక్త న్యూ లుక్ వెనక సీక్రెట్ ఏంటి?
ఇక వివరాల్లోకి వెళ్తే.. ‘భీమ్లా నాయక్’లో రానా భార్యగా నటించిన సంయుక్త, ఉన్నది కొద్దిసేపు అయినా సరే ప్రేక్షకుల్ని ఎట్రాక్ట్ చేసింది. ఆ తర్వాత కల్యాణ్ రామ్ ‘బింబిసార’ పోలీస్ గా నటించింది. మోడ్రన్ లుక్ లో కనిపించి, ఈ మూవీతోనూ హిట్ అందుకుంది. తాజాగా ‘సార్’తో ఏకంగా వంద కోట్ల క్లబ్ లో చేరిపోవడంతో పాటు తెలుగు, తమిళంలో ఒకేసారి స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుంది. ఈమె హీరోయిన్ గా చేసిన చిత్రం ‘విరూపాక్ష’. ఏప్రిల్ 21న థియేటర్లలోకి వచ్చే ఈ మూవీ ట్రైలర్ ని తాజాగా రిలీజ్ చేశారు.
సోషియో ఫాంటసీ స్టోరీతో తీసిన ‘విరూపాక్ష’ ట్రైలర్ బాగానే ఉంది. కానీ చాలామంది మాత్రం సంయక్త మేనన్ దగ్గరే స్టక్ అయిపోయారు. ఎందుకంటే ఇప్పటివరకు చూడని సరికొత్త లుక్ ని ఇందులో ప్రెజెంట్ చేశారు. రింగు రింగుల హెయిర్ కు తోడు.. లంగాఓణీలో గ్లామర్ చూపిస్తూ మత్తెక్కించేలా ఉంది. మరీ ముఖ్యంగా.. ‘ఎంత పెద్ద కళ్లుంటే అంత ఎక్కువ భయమున్నట్లు..’ అని హీరో సాయిధరమ్ తేజ్ డైలాగ్ చెప్పేటప్పుడు ఓ షాట్ ఉంది. అక్కడ సంయుక్తని చూసి ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోవాల్సిందే. ఆ ఫ్రేమ్ లో అంత బాగుంది మరి. సరే సంయుక్త మేనన్ ఈ లుక్ లో చూసిన తర్వాత మీకేం అనిపించింది. కింద కామెంట్ చేయండి.