సమీరా రెడ్డి.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని లేని పేరు. టాలీవుడ్ లో చేసింది అతి తక్కువ సినిమాలే అయిన.. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మదిలో బలమైన ముద్ర వేసుకుంది. అయితే 2013లో ఎంటర్ ప్రెన్యూర్ అక్షయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. మ్యారేజ్ తర్వాత సమీరా సినిమాలకు కూడా గుడ్ బాయ్ చెప్పింది. ఆ తర్వాత ఏ చిన్న పాత్రలోనూ కనిపించలేదు ఈ అమ్మడు. సోషల్ మీడియాలో మాత్రం సమీరా ఫుల్ యాక్టివ్ ఉంటోంది. తన జీవిత విశేషాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరగానే ఉంటోంది. గతంలో ఆమె గర్భం దాల్చిన సందర్భంలో స్విమ్మింగ్ పూల్ లో ప్రత్యేకంగా అండర్ వాటర్ మేటర్నీటి ఫోటో షూట్ నిర్వహించింది. దీనికి సంబంధించిన ఫోటోలతో కూడీన వీడియోలను మధుర జ్ఞాపకాలు అంటూ తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘నరసింహుడు’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది సమీరా రెడ్డి. ఆ తరువాత జై చిరంజీవా, అశోక్ వంటి సినిమాలో నటించి మెప్పించింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ , హిందీ బాషాల్లో అనేక చిత్రాల్లో నటించింది. 2013 అక్షయ్ అనే బిజినేస మ్యాన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి తరువాత సమీరా రెడ్డి పూర్తిగా మారిపోయింది. ఆమె భర్త, పిల్లలతో కలిసి వెకేషన్‌లకు వెళ్లిన ఫోటోలను షేర్ చేయడం, బీచ్‌లో పిల్లలతో ఆడుకోవడం, బికినీలో కనిపించడంతో ఒక్కసారిగా హాట్ టాపిక్ అయింది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే సమీరా రెడ్డి.. తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. ఈ క్రమంలో గత జ్ఞాపకాలను సైతం మళ్లీ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది.
ఆమె 2019 ప్రెగ్నెన్సీ సమయంలో నీటి కొలనులో దిగిన బేబి బంప్ ఫోటోలను తాజాగా ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఆడవాళ్లు తమ శరీరాన్ని ప్రేమించే విధంగా ప్రోత్సహించడమే తన ఫోటో షూట్ ఉద్దేశ్యం అని పేర్కొంది. తాను గర్భవతిగా ఉన్నప్పుడు ఎంతో అందమైన బాడీని కలిగి ఉన్నానంటూ సమీరారెడ్డి పోస్ట్ పెట్టింది. గర్భంలో తన బిడ్డలను మోస్తున్నప్పుడు ఎంత అందంగా ఉన్నానో చూడండని సమీరారెడ్డి పేర్కొంది. ఆమె గతంలో దిగిన బేబి బంప్ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. మరి.. వైరల్ అవుతున్న సమీరా రెడ్డి వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.