సాధారణంగా నేటి సమాజంలో ఏ ఫంక్షన్ కైనా వెళ్తే.. ముందుగా ఎదురైయ్యే ప్రశ్న ఏం చదువుతున్నావ్ బాబు.. అని. లేదా ఏం చేస్తున్నావ్ బాబూ అని. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు మన పెద్ద వాళ్లు చదువుకు ఎంత ప్రాముఖ్యం ఇస్తారో! మరి అలాంటి చదువులో మనకు నచ్చిన హీరోనో.. హీరోయిన్నో ముందుంటే? మనమే ఉన్నట్లు ఫీలౌతాం కదా! అయితే ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్ కు సంబంధించిన మార్కుల లిస్టు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. మరి ఆ బడా హీరోయిన్ ఎవరు? ఆమెకు వచ్చిన మార్కులు ఎన్ని? లాంటి మరిన్ని వివరాలు తెలుసుకుందాం పదండి..
టాలీవుడ్ లో చాలా మంది నటీ, నటులు పెద్ద పెద్ద చదువులే చదివారు. మన మెగాస్టార్ చిరంజీవి – డిగ్రీ ఇన్ కామర్స్ చదవగా, జూ. ఎన్టీఆర్.. ఇంటర్ తోనే ఆపేశారు. అలాగే ఇంకా చాలా మంది డిగ్రీ, MBA,b.tech,b.comలు చదివారు. విదేశాల్లో సైతం చదివిన హీరోలు, హీరోయిన్ లు టాలీవుడ్ లో ఉన్నారు. అయితే తాజాగా నెట్టింట్లో సమంతకు చెందిన పదవ తరగతి మార్కుల లిస్టు వైరల్ గా మారింది. ఆ మార్కుల లిస్టును చూసిన వారు సమంత ఇంత బాగా చదువుతుందా అని ముక్కున వేలేసుకుంటున్నారు.
సమంత.. అంటే అందం, అభినయం.. ఇదే మనకు సమంత గురించి తెలిసిన విషయం. కానీ మనకు తెలీని తారల గతాలు కూడా ఉంటాయి. అవి బయటపడ్డప్పుడే వారిలో ఇంత టాలెంట్ ఉందా అని మనకు తెలుస్తుంది. ఇప్పుడూ అదే జరిగింది. అవును సమంత చదువులో టాపర్. దానికి సంబంధించిన మార్కులు లిస్టు బయటపడింది. సమంత చెన్నైలోని సెయింట్ స్టీఫెన్స్ మెట్రిక్యూలేషన్ స్కూల్ లో పదవ తరగతి చదివింది. అప్పుడు హాఫ్ ఇయర్లీ పరీక్షల్లో 1000 మార్కులకు గాను సమంత కు 887 మార్కులు వచ్చాయి. అదీ కాకుండా మ్యాథ్స్ లో ఏకంగా 100కు 100 మార్కులు వచ్చాయి. స్కూల్ టీచర్లు సైతం ఆమెను ప్రశంసిస్తూ ప్రోగ్రెస్ కార్డ్ లో ప్రత్యేకంగా రాశారు. ఇప్పుడు ఈ లిస్టును చూసిన అభిమానులు తమ హీరోయిన్ టాపర్ అంటూ మురిసిపోతున్నారు. మరి సమంత మార్కుల లిస్టుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
samantha 10th class marks list pic.twitter.com/UaBpm1yqKD
— Sekhar Rambo (@RamboSekhar) July 29, 2022