సమంత టాపిక్ రాగానే ప్రేక్షకులు, ఆమె అభిమానులు ప్రతి ఒక్కరూ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే సినిమాలతో పాటే వ్యక్తిగతంగానూ ఆమె ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటుంది. కొన్నాళ్ల నుంచి హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తున్న సామ్.. గతేడాది నవంబరులో ‘యశోద’గా వచ్చింది. త్వరలో ‘శాకుంతలం’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించనుంది. అయితే కెరీర్ పరంగా బాగానే ఉన్న సమంత.. హెల్త్ పరంగా చాలా డిస్ట్రబ్ గా ఉంటుంది. ఇలాంటి టైంలో ఇన్ స్టాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఇది కాస్త వైరల్ గా మారింది.
ఇక విషయానికొస్తే.. ముద్దుగుమ్మ సమంత యాక్టింగ్ గురించి వంక పెట్టడానికి లేదు. తొలుత గ్లామర్ హీరోయిన్ రోల్స్ చేసినప్పటికీ.. ఆ తర్వాత మాత్రం నటనా ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్ గా మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడింది. చికిత్స కోసం కెరీర్ కు బ్రేక్ ఇచ్చింది. ఇంట్లోనే చికిత్స తీసుకుంటోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం కాస్త కుదుటపడింది. ఈ క్రమంలోనే తాజాగా ముంబయి ఎయిర్ పోర్ట్ లో సమంత కనిపించింది. అయితే గతంతో పోలిస్తే చాలా బలహీనంగా కనిపించింది. ప్రస్తుతం ‘శాకుంతలం’ సినిమాకు డబ్బింగ్ చెబుతూ బిజీగా ఉంది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ.. ఫిబ్రవరి 17న థియేటర్లలో విడుదల కానుంది. ఇక తాజాగా ఈ సినిమా గురించి, షూటింగ్ లో పడిన కష్టాల గురించి సమంత ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.
‘శాకుంతలం మూవీ నటింటే టైంలో నా క్యారెక్టర్ కు తగ్గట్లు ముఖంలో ఎక్స్ ప్రెషన్స్ ఒకేలా పెట్టడం, ఒకే పోజులో నిలబడటం చాలా కష్టంగా అనిపించేది. నడుస్తున్న టైంలో, మాట్లాడుతున్నప్పుడు, పరుగెత్తినప్పుడు, చివరకు ఏడుస్తున్న టైంలోనూ ముఖంలో ఎక్స్ ప్రెషన్స్ ఒకేలా పెట్టాల్సి వచ్చేది. అలా చేయడానికి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇలా ఉండటం కోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నాను. దానికంటే నా పెంపుడు కుక్క షాషాను తీసుకెళ్తే బాగుండేది.’ అని సమంత ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఇది కాస్త వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా.. ‘శాకుంతలం’ తర్వాత హిందీలో ఓ సామ్ ఓ హిందీ వెబ్ సిరీస్ లో చేయాలి. అయితే ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి కారణంగా, ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకొన్నట్లు తెలుస్తోంది. సరే ఇదంతా పక్కనబెడితే.. సామ్ ఎమోషనల్ పోస్ట్ చూడగానే మీకు ఏమనిపించింది. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయం చెప్పండి.