సమంత ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండతో కలిసి ఖుషీ అనే సినిమాలో నటిస్తున్నారు. హిందీ, ఇంగ్లీష్ బైలింగువల్ సినిమా ‘చెన్నై స్టోరీస్’లోనూ ఆమె నటిస్తున్నారు.
సమంత సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 13 ఏళ్లు అవుతోంది. మొదటి సినిమా ‘ఏమాయ చేశావే’ నుంచి ఇప్పటి వరకు 30కి పైగా సినిమాల్లో నటించారు. తెలుగు, తమిళ భాషల్లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా వెలుగొందుతున్నారు. సమంత తన కెరీర్‌ను ప్రారంభించిన ఒకే సంవత్సరంలో నాలుగు సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. వాటిలో ‘మాస్కోవిన్ కావేరీ’ ఒకటి. ఈ సినిమాలో ఆమె ప్రముఖ నటుడు, దర్శకుడు అయిన రాహుల్ రవీంద్రన్తో కలిసి నటించారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా..
సమంత, రాహుల్‌ల మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. రాహుల్ రవీంద్రన్ భార్య ప్రముఖ సింగర్ చిన్మయితో కూడా సమంతకు మంచి అనుబంధం ఉంది. ఈ ముగ్గురూ బెస్ట్ ఫ్రెండ్స్‌గా మారిపోయారు. వీలు చిక్కినప్పుడల్లా కలిసి పార్టీలకు, షికార్లుకు వెళుతూ ఉంటారు. విడాకులు, అనారోగ్యం సమయంలోనూ ఈ ఇద్దరూ సమంతకు తోడుగా నిలిచారు. అందుకే సమంతకు ఈ ఇద్దరిపై కొండంత ప్రేమ ఏర్పడింది. తాజాగా, సమంత తన చిరకాల మిత్రుడు రాహుల్ రవీంద్రన్ గురించి ఓ ఎమోషనల్ పోస్టు పెట్టారు. సమంత తన ఇన్స్టాగ్రామ్ పోస్టులో
‘‘ మీకు తెలిసిన ఓ మంచి వ్యక్తిని తీసుకోండి.. ఆ వ్యక్తిని వందతో హెచ్చువేయండి. అలా చేస్తే ఎంత మంచోళ్లు అవుతారో.. నా బెస్ట్ ఫ్రెండ్ అంత మంచోడు. నేను ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూ ఉంటాను రాహుల్ రవీంద్రన్. అతడు భోజనప్రియుడు. కానీ, మనకు కంపెనీ అవసరం అయినపుడు కచ్చితంగా ఆ భోజనాన్ని కూడా పక్కన పెట్టేస్తాడు. అది అతడ్ని ఒకరకంగా చంపేస్తుంటుంది’’ అని పేర్కొన్నారు. ఇక, ఈ పోస్టుపై రాహుల్ రవీంద్రన్ స్పందించాడు. ‘‘ పాప. ఇప్పుడు ఏడిపిస్తావా ఏంటి?.. నేను కూడా నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాను’’ అని అన్నారు. వీరిద్దరి పోస్టులపై చిన్మయి స్పందిస్తూ.. ‘‘ హా.. హా.. బెస్ట్!’’ అని పేర్కొన్నారు. మరి, రాహుల్ రవీంద్రన్‌పై సమంత పెట్టిన ఎమోషనల్ పోస్టుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.