తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకం ఈ బోనాల పండుగా. ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో ఈ బోనాల పండుగా ఘనంగా జరుగుతుంది. అలా ఈ ఏడాది కూడా బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ఇది చివరి ఆదివారం కావడంతో తెలంగాణలోని అన్ని ఊళ్ళల్లో బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. మహిళలు, యువతులు సంప్రదాయంగా తయారై.. బోనం తీసుకొని గుడికి వెళ్లి అమ్మవారికి సమర్పిస్తారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ బోనాలని నిర్వహించేందుకు అనేక ఏర్పాట్లను చేసింది. చాలా మంది సినీ, రాజకీయ ప్రముఖులు సైతం అమ్మవారికి బోనం సమర్పించి.. తమ మొక్కు తీర్చుకుంటారు. వారికి సంబంధించిన ఆ ఫొటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. తాజాగా తెలుగు లేడి పవర స్టార్ గా పిలవబడుతున్న సాయి పల్లవి బోనమెత్తిన ఫొటో ఒకటి వైరల్ అవుతుంది.
నేచురల్ బ్యూటీ సాయి పల్లవి బోనం ఎత్తింది. అచ్చతెలుగు తెలంగాణ ఆడపడుచు లా తయారయిన ఈ మలయాళ బ్యూటీ.. బోనమెత్తి సందడి చేసింది. అయితే ప్రస్తుతం జరుగుతున్న పండుగ సందర్భంగా సాయిపల్లవి బోనం ఎత్తలేదు. విరాట పర్వం సినిమాలో బోనం ఎత్తింది. ఆ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. రీసెంట్గా రానా, సాయిపల్లవి కాంబినేషన్లో వచ్చిన మూవీ విరాటపర్వం. ఇక ఈ మూవీ డైరెక్టర్ వేణు ఊడుగుల బోనాల పండుగను, తెలంగాణ సంసృతిని కండ్లకు కట్టినట్టు చూపించారు. అందులో భాగంగానే సాయిపల్లవి లంగావోణిలో అచ్చతెలుగుదనం ఉట్టిపడేలా బోనం ఎత్తుకొని వచ్చే సీన్స్ వీరాటపర్వానికి హైలెట్ అయ్యాయి.
బోనాల పండుగ సందర్భంగా విరాటపర్వం సినిమాలోని సాయిపల్లవి బోనాలు ఎత్తుకున్న స్టిల్స్ ను షేర్ చేస్తూ..అందరికీ బోనాలు శుభాకాంక్షలు తెలిపారు వేణు ఊడుగుల. ఇక ఆయన పెట్టిన హ్యాపీ బోనం అనే హ్యాష్‌ట్యాగ్ వైరల్ అవుతోంది. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
గ్రామీణ జీవన సంస్కృతికి,ప్రకృతికి, పర్యావరణానికి తెలంగాణ ఆడబిడ్డలు తీర్చుకునే మొక్కు బోనాల పండుగ! ఇది తెలంగాణ ప్రజల అస్తిత్వ పతాక!#Happybonam pic.twitter.com/wSVxr0yvJj
— v e n u u d u g u l a (@venuudugulafilm) July 24, 2022