'ఆర్ఆర్ఆర్'కు ఆస్కార్ రావడంతో ప్రతిఒక్క తెలుగువాడు గర్వపడుతున్నాడు. ఈ అవార్డును చూసి తెగ మురిసిపోతున్నాడు. ఇలాంటి టైంలో చిత్రబృందానికి మరో అరుదైన గౌరవం కూడా దక్కబోతున్నట్లు అనిపిస్తోంది.
ఓ తెలుగు సినిమాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడం అనేదా చాలా ఏళ్ల క్రితమే జరిగింది. కానీ ఫర్ ది ఫస్ట్ టైమ్.. ఆస్కార్ రావడం మాత్రం ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతోనే సాధ్యమైంది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఈ చిత్రబృందం.. బుధవారం కల్లా స్వదేశంలో అడుగుపెట్టనుంది. ప్రపంచం గర్వించదగ్గ అవార్డు గెలుచుకున్నారు కదా.. ఆ రేంజులోనే ప్రశంసలు దక్కుతున్నాయి. ఇక భారత గడ్డపై అడుగుపెట్టిన తర్వాత సన్మానాలు, ఆ హడావుడి కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఈ క్రమంలోనే ‘ఆర్ఆర్ఆర్’ చిత్రబృందాన్ని పార్లమెంటులో సన్మానించబోతున్నారనే విషయం కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ‘బాహుబలి’తో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ రాజమౌళి, దీని సీక్వెల్ తో వరల్డ్ వైడ్ ఫేమస్ అయిపోయాడు. గతేడాది రిలీజైన ‘ఆర్ఆర్ఆర్’తో వెస్ట్రన్ ఆడియెన్స్ ని కూడా మెప్పించేశాడు. హాలీవుడ్ దిగ్గజ దర్శకులైన స్టీవెన్ స్పీల్ బర్గ్, జేమ్స్ కామెరూన్ లాంటి వాళ్లే.. రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ని తెగ మెచ్చుకున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా కొన్నాళ్ల ముందు వైరల్ అయ్యాయి. తాజాగా గోల్డెన్ గ్లోబ్ తో పాటు ఆస్కార్ కూడా ఈ మూవీ గెలుచుకునేసరికి భారతదేశంలోని ప్రతి ఒక్కరూ ఇది మన సినిమా అని గర్వంగా చెప్పుకుంటున్నారు. ఇలాంటి టైంలో తెలుగు ఎంపీ ఒకరు, పార్లమెంటులో ఓ అద్భుతమైన ప్రతిపాదన తీసుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న సీఎం రమేష్.. తాజాగా పార్లమెంటులో తెలుగులో ప్రసంగించారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు ఆస్కార్ రావడం చాలా ఆనందంగా ఉందని చెప్పిన ఆయన.. చిత్రబృందాన్ని పార్లమెంటులోనే సన్మానిద్దామని ప్రతిపాదన చేశారు. ఆ సినిమా రైటర్ విజయేంద్రప్రసాద్ కూడా పార్లమెంటులోనే ఉన్నారనే విషయాన్ని గుర్తుచేసుకున్నారు. ఇదంతా చూస్తుంటే.. ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ఖాతాలో మరో అరుదైన గౌరవం చేరబోతుందని తెలుస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే మాత్రం తెలుగు సినిమా స్థాయి ఎక్కడికో వెళ్లిపోతుంది. మరి ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ కు పార్లమెంటులో సన్మానం అనే విషయమై మీరేం అంటారు. కింద కామెంట్ చేయండి.