“ఆర్.ఆర్.ఆర్”.. ఈ సినిమా కోసం ఇప్పుడు దేశం అంతాఎదురు చూస్తోంది. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో.. యన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా.. అత్యంత భారీ బడ్జెట్‌తో ఆర్.ఆర్.ఆర్ తెరకెక్కింది. మార్చి 25న ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ పై చిత్ర బృందం దృష్టి పెట్టింది. ఇప్పటికే ముంబయిలో ట్రిపుల్ ఆర్ ప్రిరిలీజ్ ఈవెంట్ పూర్తి అయ్యింది. ఇక దుబాయ్‌లో కూడా భారీగా ఈవెంట్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సౌత్ ఇండియా ప్రమోషన్స్ పై ఫోకస్ చేసిన జక్కన్న.. ఇందుకు కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్ వేదికగా చేసుకున్నాడు. తాజాగా ఇక్కడ నిర్వహించిన ఆర్.ఆర్.ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సూపర్ సక్సెస్ అయ్యింది. అయితే.. ఈ స్టేజ్ పై నుండి జూనియర్ యన్టీఆర్ చాలా ఎమోషనల్ గా మాట్లాడారు.
తారక్ తన స్పీచ్ లో ముందుగానే స్వర్గీయ పునీత్ రాజ్‌కుమార్ ను గుర్తు చేసుకున్నారు. “ఈ చల్లని సాయంత్రాన ఆయన ఓ వర్షపు చినుకు రూపంలో, చల్లని గాలి రూపంలో మన పక్కనే ఉన్నారు. నిజానికి.. పునీత్ రాజ్‌కుమార్ లేరని నేను ఎప్పుడూ భావించడం లేదు. ఇందుకే పునీత్ కోసం నెప్పుడూ ఏడవలేదు.. ఏడవను కూడా. పునీత్ అంటే ఓ సెలబ్రేషన్.. జేమ్స్ మూవీ ఈ విషయాన్ని తెలియజేసింది. అందుకే ఆయన మన మధ్యలో లేరని ఎవరూ బాధపడొద్దు” అని యన్టీఆర్ ఫ్యాన్స్ ని కోరారు.
ఇక RRR సినిమా గురించి మాట్లాడుతూ కూడా తారక్ కాస్త ఎమోషనల్ అయ్యారు. “RRR కేవలం ఓ సినిమా మాత్రమే కాదు. మా ముగ్గురి మధ్య ఉన్న బంధం. తన సినిమాల ద్వారా భారతదేశం యూనిటీ చాటాలని తాపత్రయపడుతున్న ఓ గొప్ప దర్శకుడి కల ఆర్.ఆర్. ఆర్. ఈ చిత్రం రాబోయే తరాలకి సైతం ఓ స్ఫూర్తి దాయకంగా ఉండబోతుంది. మా జక్కన్న కట్టబోయే రామసేతు లాంటి నిర్మాణంలో ఉడత లాంటి తనకు ఓ పాత్ర ఇచ్చినందుకు ధన్యవాదాలు అంటూ”.. తారక్ తన ప్రసంగాన్ని ముగించాడు. మరి.. యన్టీఆర్ స్పీచ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.