భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన RRR చిత్రం అదే రేంజ్ విజయాన్ని అందుకుంది. బాహుబలి రికార్డులను తిరగరాస్తుంది అంటున్నారు. అసలు ఇద్దరు స్టార్ హీరోలను తీసుకుని.. ఇద్దరికి సమ ప్రాధాన్యం ఇచ్చి.. వారి మధ్య ఎలాంటి విబేధాలు తలెత్తకుండా.. సినిమాను కంప్లీట్ చేయడం అంటే దర్శకుడికి కత్తి మీద సామే. ఈ విషయంలో దర్శకుడు రాజమౌళి విజయం సాధించారనే చెప్పవచ్చు. ఇరువురు స్టార్ హీరోలకు సమ ప్రాధాన్యం ఇస్తూ.. వారి నుంచి తనకు కావాల్సిన ఔట్‌పుట్ రాబట్టుకున్నారు. ఇక రాజమౌళి సినిమా అంటే హీరోలు ఎంత కష్టపడతారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక RRR కోసం చెర్రి, తారక్‌లకు కూడా ఓ రేంజ్‌లో కష్టపడ్డారు. ఈ క్రమంలో ఓ సీన్ కోసం రామ్ చరణ్ ఎంత కష్టపడ్డారో తెలిపే వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో వైరలవుతోంది. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: RRR సినిమా కోసం ఎవరెవరు ఎంత తీసుకున్నారంటే!
RRR సినిమాలో రామ్ చరణ్ ఓ సీన్‌లో బాక్సింగ్ చేస్తాడు. తనలో అణుచుకుని ఉన్న ఆవేశం అనే అగ్ని పర్వతాన్ని బద్దలు కొట్టేట్టుగా ఆ సన్నివేశం కనిపిస్తుంది. ఈ సీన్‌లో రామ్ చరణ్ ఎంతో కసిగా బాక్సింగ్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. కొన్ని సెకన్ల నిడివి ఉన్న ఆ సీన్ కోసం రామ్ చరణ్ ఎంతో కష్టపడ్డారో తెలిపే వీడియోనొకదాన్ని ట్వీట్ చేశారు. ఆ సీన్ కోసం రామ్ చరణ్‌కు బాక్సింగ్ ట్రైనింగ్ ఇచ్చిన వ్యక్తి ఇందుకు సంబంధించిన వీడియోని ట్వీట్ చేశాడు.
ఇది కూడా చదవండి: RRR ఆ హీరోకి నేషనల్ అవార్డు పక్కా.. ప్రముఖ విమర్శకుడి సంచలన వ్యాఖ్యలు
‘‘RRR సినిమాలో బాక్సింగ్ గురించి చిన్న సీన్ ఉంటుంది. సెకన్ల నిడివి ఉన్న ఆ సీన్ కోసం నా బ్రదర్ రామ్ చరణ్ చాలా కష్టపడ్డాడు. చెమటను చిందించి, ప్రాణం పెట్టాడు. ఫలితం సినిమాలో తన పవర్ ప్యాక్ పర్‌ఫామెన్స్’’ అంటూ ట్వీట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది.
ఇది కూడా చదవండి: రామ్ చరణ్ ఎంట్రీ.. ఆనందంతో అల్లరి చేసిన ఉపాసన..
మొత్తానికి ఈ చిత్రం మాత్రం యునానిమస్‌గా హిట్ టాక్ తెచ్చుకుంది. ఓవర్సీస్, నార్త్ ఇలా అన్ని చోట్లా ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వచ్చింది. దీంతో సినిమా కలెక్షన్లు భారీగా ఉండబోతోన్నట్టు కనిపిస్తోంది. మున్ముందు ఇక నాన్ ఆర్ఆర్ఆర్ రికార్డులు అనే పరిస్థితి తలెత్తుతుంది అంటున్నారు సినీ విశ్లేషకులు. రామ్ చరణ్ డెడికేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.