దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన పీరియాడిక్ పాన్ ఇండియా మూవీ ‘RRR‘. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రాధాన పాత్రలో రూపొందిన ఈ సినిమా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైన ఈ మూవీ.. ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ తో అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతోంది. బాహుబలి 2తో ఇండియన్ సినిమా స్టాండర్డ్స్, కలెక్షన్స్ మరో స్థాయికి తీసుకెళ్లి.. కొత్త రికార్డులు సెట్ చేశాడు రాజమౌళి. తాజాగా RRRతో ఆ రికార్డులన్నింటిని తిరగరాస్తున్నాడు. సౌత్, నార్త్, వరల్డ్‌వైడ్‌గా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది RRR మూవీ. ఇక వరుసగా నాలుగో రోజు కూడా భారీ వసూళ్లూ రాబట్టింది RRR చిత్రం.
ఇది కూడా చదవండి: ప్రపంచ రికార్డు బ్రేక్ చేసిన RRR.. మూడు రోజుల్లోనే అరుదైన ఫీట్!
నాలుగో రోజే ఏపీ, తెలంగాణలో RRR కలెక్షన్లు ఇలా ఉన్నాయి.
నైజాం – 8.15 కోట్ల రూపాయలు
గుంటూరు – 1.10 కోట్ల రూపాయలు
క్రిష్ణ – 1.0కోట్ల రూపాయలు
ఉత్తరాంధ్ర – 2.26 కోట్ల రూపాయలు
సీడెడ్ – 2.50 కోట్ల రూపాయలు
ఈస్ట్ – 97 లక్షల రూపాయలు
వెస్ట్ – 67 లక్షల రూపాయలు
నెల్లూరు – 60 లక్షల రూపాయలు
నాలుగో రోజు ఏపీ, తెలంగాణ టోటల్ గ్రాస్– 17.3 కోట్ల రూపాయలు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో గత నాలుగు రోజులకు కలిపి RRR మొత్తం కలెక్షన్లు ఇలా ఉన్నాయి…
నైజాం: 61.6 కోట్ల రూపాయలు
సీడెడ్: 31.92 కోట్ల రూపాయలు
ఉత్తరాంధ్ర: 17.27 కోట్ల రూపాయలు
వెస్ట్: 8.66 కోట్ల రూపాయలు
ఈస్ట్: 9.69 కోట్ల రూపాయలు
గుంటూరు: 12.42 కోట్ల రూపాయలు
నెల్లూరు: 5.42 కోట్ల రూపాయలు
క్రిష్ణ: 8.24 కోట్ల రూపాయలు
నాలుగు రోజులకు కలిపి ఏపీ, తెలంగాణ టోటల్ గ్రాస్: 156.22 కోట్ల రూపాయలుగా ఉంది.
కలెక్షన్ల సునామీ సృష్టిస్తోన్న RRR సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: రామ్ చరణ్ బర్త్‌డే.. వైరలవుతున్న వరుణ్‌తేజ్ కామెంట్స్!