సినిమా ప్రపంచం అన్నది జూదం లాంటిది. సినిమా జీవితం మొత్తం ఎక్కువగా లక్ మీదే ఆధారపడి ఉంటుంది. అందుకే టాలెంట్‌తో పాటు అదృష్టం కూడా ఉన్నవారే పైకి ఎదుగుతూ ఉంటారు. సీనియర్, జూనియర్.. అందంగా ఉన్నవాళ్లు లేని వాళ్లు అన్న తేడాలు ఏవీ ఉండవు. ఎవరికి అదృష్టం కలిసి వస్తే వారు పైకి ఎదుగుతూ ఉంటారు. లేకపోతే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు ఉంటుంది పరిస్థితి. వచ్చి దశాబ్ధాలు గడుస్తున్నా.. సరైన అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న నటీ,నటులు చాలా మంది వారు. తమకంటే వెనక వచ్చి పైకి ఎదుగుతున్న వారిని చూపినపుడు.. తమకు అవకాశాలు రావట్లేదే అంటూ బాధపడుతున్నారు.
అలాంటి వారిలో ప్రముఖ నటి రేష్మ పసుపులేటి కూడా ఒకరు. ఆమె ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అయినా కూడా సరైన అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె తన ఆవేదనను సోషల్ మీడియా వేదికగా వెల్లబుచ్చారు. తనకు ప్రముఖ తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజ్ సినిమాలో అవకాశం కావాలని కోరారు. ఈ మేరకు మంగళవారం తన ట్విటర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌లో.. ‘‘ నేను డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ సినిమాలో భాగం కావాలని కోరుకుంటున్నాను. ఆయన్ని ఎలా కలవాలో తెలియటం లేదు.
ఎవరైనా నన్ను ఆయన దగ్గరకు చేరుకునేలా చేయండి. నేను 12 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో ఉంటున్నాను. సరైన అవకాశాలు లేవు. మాకంటే కొత్తగా వచ్చిన వాళ్లే ఎక్కువ అవకాశాలు దక్కించుకుంటున్నారు. అందులో ఎలాంటి తప్పు లేదు. కానీ, ఇలాంటి బాగా లేని సిస్టంను మార్చాలి’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె పెట్టిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. ఆమెను కొంతమంది సపోర్ట్ చేస్తుంటే.. మరికొంతమంది దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. మరి, అవకాశాలు రావటం లేదంటూ రేష్మ ట్వీట్ చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Wanna be a part @Dir_Lokesh I don’t know how to get to him. Someone hook up a sista #pro #ontheprowl #beenintheindustry12years someone’s gotta do me rite I mean the new bees get more opportunities than us. No offence but it’s https://t.co/mzW9lpLfRw gotta change y’all ❤️ pic.twitter.com/KeJHQOmhjF
— Reshma Pasupuleti (@reshupasupuleti) January 24, 2023