బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా-అర్జున్ కపూర్‌ల మధ్య ఉన్న రిలేషన్ గురించి అందరికి తెలుసు. వీరిద్దరూ గత నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఈ విషయాన్ని వారు ఎప్పుడు దాచలేదు. ఇద్దరు కలిసి వెకేషన్స్, పార్టీలు, ఫంక్షన్స్ ఇలా జంటగా తిరగడమే కాక.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో కూడా షేర్ చేస్తారు. అయితే మలైకా అరోరాకు గతంలోనే వివాహం అవ్వడమే కాక ఓ కుమారుడు కూడా ఉన్నాడు. మలైకా గతంలో సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్‌ని వివాహం చేసుకుంది. 17 ఏళ్ల తర్వాత ఆ బంధం నుంచి బయటకు వచ్చింది. ఆ తర్వాత అర్జున్ కపూర్‌తో రిలేషన్‌లో ఉంది. దీనిపై వీరిద్దరి మీద గతంలో ఎన్నో విమర్శలు వచ్చాయి. నీ వయసేంటి.. అతడి వయసేంటి.. ముసలి వయసులో ఈ ఘాటు ప్రేమ అవసరమా అంటూ అనేక సార్లు విమర్శించారు నెటిజనులు. కానీ ఈ జంట.. విమర్శలను ఏమాత్రం లేక్క చేయక.. ఎంజాయ్ చేస్తుంటారు.
సరే ఆ సంగతి అలా వదిలేస్తే.. తాజాగా ఈ లవ్ బర్డ్స్ తమ రిలేషన్‌కు సంబంధించి పెద్ద అప్డేట్ ఇచ్చారు. త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు మలైకా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. సిగ్గుపడుతున్న ఫోటో షేర్ చేసి ‘‘అవును.. నేను అంగీకరించాను’’ అంటూ వెడ్డింగ్ రింగ్స్ ఎమోజీని జత చేసింది. ఈ పోస్ట్ చూస్తే.. మలైకా పెళ్లికి ఎస్ చెప్పినట్లు అర్థం అవుతోంది. అంటే త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతున్నారన్నమాట.
అయితే మరి కొందరు మాత్రం ఇదంతా ప్రమోషన్స్ కోసం చేసిన పోస్ట్ అని అనుమానిస్తున్నారు. ఎందుకంటే గతంలో సోనాక్షి కూడా ఇలానే తన చేతికి రింగ్‌తో ఉన్న ఫోటో షేర్ చేయడంతో.. చాలా మంది ఆమెకి ఎంగేజ్‌మెంట్ అయ్యిందని భావించారు. కానీ తీరా చూస్తే.. సోనాక్షి.. తన కొత్త బిజినెస్ ప్రమోషన్ కోసం ఆ ఫోటో షేర్ చేసింది. ఇప్పుడు మలైకా కూడా అలాంటి ఫోటోనే షేర్ చేయడంతో కొందరు అనుమానిస్తున్నారు. పైగా ఫోటోలో మలైకా చేతికి ఎక్కడా రింగ్ లేదు. మరి కొందరేమో.. ఏమో పెళ్లి చేసుకుంటారేమో అని కామెంట్స్ చేస్తున్నారు.
ఇక మలైకా టాలీవుడ్‌లో గబ్బర్ సింగ్ సినిమాలో కెవ్వు కేక స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పాట అప్పట్లో తెగ ఫేమస్ అయ్యింది. ఇక నాలుగు పదుల వయసు దాటినప్పటికి.. చెక్కుచెదరని అందం.. మంచి ఫిట్‌నెస్‌తో కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తుంది మలైకా. తన సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా ఎక్సర్‌సైజ్, యోగా చేస్తున్న ఫోటోలను షేర్ చేస్తుంది.