ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం “పుష్ప”. ఆ సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో అందరికి తెలిసిందే. అయితే పుష్ప మూవీ విడుదల సమయంలో డివైడ్ టాక్ వచ్చింది. ఆ సమయంలో ఈ మూవీని సూపర్ స్టార్ మహేష్ బాబు వదులుకోని మంచి పని చేశారని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేశారు. అయితే ఆ తర్వాత టాక్ తో సంబంధం లేకుండా ఈ చిత్రం భారీ కలెక్షన్లు సాధించడంతో పాటు బాలీవుడ్ లో కూడా అంచనాలకు మించి వసూలు సాధించింది. దీంతో ఈ చిత్రం మహేష్ బాబు చేసి ఉంటే బాగుండేది అని కొంతమంది అభిప్రాయపడ్డారు.
ఈ విషయాలు పక్కన పెడితే మహేష్ బాబు.. పుష్ప మూవీని తిరస్కరించడం వెనుక అసలు కారణం వేరే ఉన్నట్లు టాక్. పుష్ప మూవీ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సంగతి తెలిసిందే. అయితే మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం కూడా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుంది. దీంతో వరుసగా ఒకే నేపథ్యం ఉన్న మూవీల్లో నటించడం ఏ హీరోకైనా కెరీర్ పరంగా అంత అనుకూలం కాదు. ఈ కారణంతో మహేష్ బాబు పుష్ప మూవీకి నో చెప్పి ఉండొచ్చని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అలా పుష్ప చిత్రంలో మహేష్ బాబు నటించక పోవడానికి జక్కన్న పరోక్షంగా కారణమయ్యారని కొంతమంది సోషల్ మీడియాలో అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలో సుకుమార్, మహేష్ బాబు కాంబినేషనలో వచ్చిన 1 నేనొక్కడినే సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకున్న కమర్షియల్ కా సక్సెస్ కాలేదు. ఇది కూడా పుష్ప మూవీని రిజక్ట్ చేయడానికి ఓ కారణమని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ఈ విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.