నిజం చెప్పులేసుకునేలోపు.. అబద్దం ప్రపంచం అంతా తిరిగి వస్తుందని సామెత. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా వినియోగం పెరిగిన ఈ రోజుల్లో.. పుకార్లు షికారు చేయడానికి ఎక్కువ సమయం పట్టడం లేదు. అందులోనూ ఇండస్ట్రీకి చెందిన వారి గురించి అయితే ఇక చెప్పక్కర్లేదు. వారు ఏం చేసినా.. సరే.. గాసిప్ రాయుళ్లు.. దానికి ఏదో ఓ కారణం ఊహించి.. ప్రచారం చేసే పనిలో ఉంటారు. తాజాగా గాసిప్ రాయుళ్లు.. జూనియర్ ఎన్టీఆర్‌పై పడ్డారు. ఆయనకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం ఫిల్మ్ నగర్‌లో తెగ ప్రచారం అవుతుంది. ఇంతకు ఆ వార్త దేని గురించి అంటే.. జూనియర్ హనుమాన్ దీక్ష తీసుకోవడం గురించి. ప్రస్తుతం ఈ అంశం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇది కూడా చదవండి: నందమూరి మల్టీస్టారర్ కు రంగం సిద్ధం! స్టార్ డైరెక్టర్ మాస్టర్ ప్లాన్!
ఇండస్ట్రీకి చెందిన సురేష్ బాబు, రామ్ చరణ్, చిరంజీవి ఇలా పలువురు ప్రముఖులు అయ్యప్ప దీక్ష తీసుకుంటారనే విషయం అందరికి తెలిసిందే. అయితే గతంలో ఎన్నడు లేనివిధంగా.. తొలిసారి జూనియర్ ఎన్టీఆర్ హనుమాన్ దీక్ష తీసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరలయ్యాయి. దాంతో జూనియర్ హనుమాన్ దీక్ష తీసుకోవడం వెనక కారణలేంటి అనే యాంగిల్‌లో ఆలోచించడం ప్రారంభించారు కొందరు. ఈ నేపథ్యంలో దోష నివారణ కోసమే ఎన్టీఆర్ హనుమాన్ దీక్ష తీసుకున్నారనే ప్రచారం నెట్టింట జోరుగా సాగుతుంది. ఇంతకు ఏ దోష నివారణ అంటే..
ఇది కూడా చదవండి: Jr. NTRతో ఒక్క సినిమాలో అయినా నటించాలని ఉంది: నటి రాధికదర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేసిన హీరో.. తదుపరి సినిమా ఫ్లాప్ కావడం పక్కా అనే సెంటిమెంట్ ఇండస్ట్రీలో బలంగా పాతుకుపోయింది. ఇటీవలే జరిగిన ‘ఆచార్య’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిరంజీవి కూడా ఇదే విషయంపై రియాక్ట్ అవుతూ.. ఆచార్య సినిమాతో రామ్ చరణ్ ఆ సెంటిమెంట్‌కు బ్రేక్ వేస్తాడని అన్నారు. అయితే ఎన్టీఆర్ కూడా ఈ సెంటిమెంట్ అనే దోషం నుంచి తప్పించుకునేందుకే RRR రిలీజ్ తర్వాత హనుమాన్ దీక్ష తీసుకున్నాడని జోరుగా ప్రచారం అవుతుంది.
ఇది కూడా చదవండి: బాలీవుడ్- టాలీవుడ్ మధ్య తేడా చూపించిన తారక్- చరణ్!
హనుమాన్ దీక్షతో జాతక రిత్యా ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయని నమ్మిన ఎన్టీఆర్.. ఈ దీక్ష తీసుకున్నారని చెప్పుకుంటున్నారు. 21 రోజల పాటు ఉండే ఈ దీక్ష.. కొన్ని రోజుల క్రితమే ముగిసినట్లు సమాచారం. త్వరలోనే ఆయన భారీ ఎత్తున హోమం కూడా చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ దీక్ష 21 రోజుల పాటు ఎన్టీఆర్ ఎంతో భక్తి శ్రద్ధలు, నియమ నిబంధనలతో పూర్తి చేశారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మరి ఇది నిజమో కాదో ఎన్టీఆర్‌కే తెలియాలి. నిజంగానే దోష నివారణ కోసమే జూనియర్ ఈ దీక్ష తీసుకున్నాడా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.