రామాయణం ఆధారంగా భారీ బడ్జెట్ తో డైరెక్టర్ ఓం రౌత్ ఆదిపురుష్ సినిమాను తెరకెక్కించారు. భారీ అంచనాలను క్రియేట్ చేసి చివరకు విమర్శలపాలయ్యారు. సినిమాలోని పాత్రలు, డైలాగులు సరిగా లేవంటూ ప్రేక్షకుల నుంచి వ్యతిరేకత వచ్చింది. తాజాగా రైటర్ మనోజ్ ముంతాషిర్ హనుమంతుడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై ఆంజనేయుడి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మాచర్ల నియోజకవర్గం తర్వాత టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నుంచి మరే అప్డేట్ రాలేదు. ఈ మధ్య అతని గురించి కొన్ని గాసిప్స్ వచ్చినా కూడా అవన్నీ పుకార్లే అని తేలిపోయింది. అయితే నితిన్ ఈ మధ్య కాలంలో బొత్తిగా బయట కూడా కనిపించడం లేదు. సోషల్ మీడియాలో కూడా దర్శనం లేదు. సడెన్ ఆదివారం ఓ హోటల్ ఓపెనింగ్ కి వచ్చేశాడు. మణికొండలో బాబాయ్ హోటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నాడు. విజయవాడలో బాగా ఫేమస్ అయిన బాబాయ్ […]
నిజం చెప్పులేసుకునేలోపు.. అబద్దం ప్రపంచం అంతా తిరిగి వస్తుందని సామెత. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా వినియోగం పెరిగిన ఈ రోజుల్లో.. పుకార్లు షికారు చేయడానికి ఎక్కువ సమయం పట్టడం లేదు. అందులోనూ ఇండస్ట్రీకి చెందిన వారి గురించి అయితే ఇక చెప్పక్కర్లేదు. వారు ఏం చేసినా.. సరే.. గాసిప్ రాయుళ్లు.. దానికి ఏదో ఓ కారణం ఊహించి.. ప్రచారం చేసే పనిలో ఉంటారు. తాజాగా గాసిప్ రాయుళ్లు.. జూనియర్ ఎన్టీఆర్‌పై పడ్డారు. ఆయనకు సంబంధించిన ఓ […]
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల హనుమాన్ దీక్ష చేపట్టి మాల ధరించిన సంగతి తెలిసిందే. దాదాపు 21 రోజుల అనంతరం ఎన్టీఆర్.. హనుమాన్ దీక్షను విరమించినట్లు తెలుస్తుంది. తాజాగా ఎన్టీఆర్ దీక్షను పూర్తిచేసినట్లు తాజాగా వైరల్ అవుతున్న ఫోటోలు చూస్తే అర్థమవుతుంది. సాధారణంగా ఎన్టీఆర్ ఇదివరకు దైవ మాల ధరించిన దాఖలాలు లేవు. కానీ ఇటీవల హనుమాన్ మాల ధరించేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఎన్టీఆర్ హనుమాన్ మాలలో ఉండగా.. పక్కనే పంతులుతో కలిసి ఉన్న […]
ప్రస్తుతం పాన్ ఇండియా, పాన్ వరల్డ్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. తాజాగా ఓ సూపర్ హీరో సినిమా గురింతి చిత్ర బృందం క్రేజీ అప్డేట్ ఇచ్చారు. తేజ సజ్జ- అమృతా అయ్యర్ జంటగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా సూపర్ హీరో చిత్రం హునుమాన్. ఈ సినిమా 100 రోజుల షూటింగ్ పూర్తి చేసుకుందంట. ఇంకా కొంత మాత్రమే షూటింగ్ మిగిలుందని తెలిపారు. ఈ సందర్భంగా దర్శక- నిర్మాతలు మీడియాతో మాట్లాడారు. ఇదీ చదవండి: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటి […]
హిందువులు ఎంతో ఆరాధ్యంగా పూజించే దైవస్వరూపాలలో ఆంజనేయ స్వామికి ప్రత్యేక చరిత్ర ఉంది. సాధారణంగా ఆంజనేయ స్వామి అనగానే మనకు సింధూరమే గుర్తొస్తుంది. అందరు దేవుళ్లకు పసుపు, కుంకుమలు పెట్టి.. ఆంజనేయ స్వామికి సింధూరం పెడుతుంటారు. అలా ఎందుకు పెడతారో తెలుసుకోవాలంటే ఓసారి రామాయణం వైపు చూడాల్సిందే. అసలు ఆంజనేయ స్వామికి సింధూరం ఎందుకంత ఇష్టం? దానికి వెనుక గల కారణాలేమిటి? ఇప్పుడు చూద్దాం. రామ – రావణ మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు శ్రీరాముడు ఆంజనేయుని భుజాలపై […]
పంచముఖ హనుమాన్ బొమ్మను మీ ఇంట్లో ఉంచితే కలిగే ఫలితాలు. హనుమంతుడు శ్రీరాముడికి పరమభక్తుడు, హనుమంతుడు భక్త సులభుడు, అంజనీ సుతుడి కరుణాకటాక్షాలు కలగాలంటే శ్రీరాముడిని పూజించి భజన చేస్తే చాలు భజన చేస్తున్న ప్రదేశంలో హనుమంతుడు ఏదో ఒక అవతారంలో ఉంటాడు అని అని చెప్తుంటారు.’యత్ర యత్ర రఘునాథ కీర్తనంతత్ర తత్ర కృతమస్తకాంజలిం… భాస్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమతః రాక్షసాంతకం… అని అందుకే అంటారు. శ్రీ మారుతి కృప ఉంటే ఎంతటి జటిలమైన సమస్య […]
యాక్షన్ కింగ్ ఇమేజ్ తెచ్చుకున్న అర్జున్ మొదటి నుంచి ఆంజనేయ స్వామికి ప్రియ భక్తుడు. ఆ అభిమానంతోనే ఆయన పద్మాసనంలో కూర్చున్న ఆంజనేయ స్వామి విగ్రహంతో కూడిన గుడిని కట్టించి ప్రారంభించారు. భక్తి భావాలు ఎక్కువగా ఉండే అర్జున్ గతంలో టాలీవుడ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘శ్రీ ఆంజనేయం’ హనుమంతుడి పాత్ర పోషించి ఆకట్టుకున్నారు. హనుమంతుడిపై ఉన్న అమితమైన భక్తితో ఆ పాత్రలో లీనమై పలువురి ప్రశంసలందుకున్నారు. వెంటనే ఆంజనేయ స్వామికి […]
మనదేశంలో ఆంజనేయస్వామి దేవాలయం లేని గ్రామం దాదాపు ఉండకపోవచ్చు. భక్తికి, దాస్యభక్తికి, ప్రసన్నతకు, చిరంజీవతత్వానికి, మేధస్సుకు, ధైర్యానికి ఇలా ఎన్నో సుగుణ సంపన్నాలకు రాశిభూతంగా ఆంజనేయస్వామిని పేర్కొనవచ్చు. రుద్రాంశ సంభూతుడైన ఆంజనేయ స్వామికి సింధూరం అంటే చాలా ఇష్టం . పురాణగాథల ప్రకారం ఒకసారి సీతమ్మ తల్లి నుదుట సింధూరం ధరించడం చూశాడు ఆంజనేయుడు. అమ్మా! సింధూరం ఎందుకు ధరిస్తున్నావు అని అడిగాడు. ఇలా అకస్మాత్తుగా అడిగేసరికి ఏం చెప్పాలో తోచని సీతమ్మతల్లి రామచంద్రునికి మేలు జరుగుతుందని […]