రామాయణం ఆధారంగా భారీ బడ్జెట్ తో డైరెక్టర్ ఓం రౌత్ ఆదిపురుష్ సినిమాను తెరకెక్కించారు. భారీ అంచనాలను క్రియేట్ చేసి చివరకు విమర్శలపాలయ్యారు. సినిమాలోని పాత్రలు, డైలాగులు సరిగా లేవంటూ ప్రేక్షకుల నుంచి వ్యతిరేకత వచ్చింది. తాజాగా రైటర్ మనోజ్ ముంతాషిర్ హనుమంతుడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై ఆంజనేయుడి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇటీవల విడుదలైన కొన్ని సినిమాలు వివాదాస్పదంగా మారాయి. వాటిల్లో ఆ మధ్యకాలంలో వచ్చిన ది కశ్మీర్ ఫైల్స్, ఇటీవల వచ్చిన ది కేరళ స్టోరీ సినిమాలు వివాదాస్పదమైన అంశాలతో తెరకెక్కి దేశవ్యాప్తంగా సంచలనంగా మారి చర్చకు దారితీశాయి. ఇక ఇదే వరుసలో తాజాగా విడుదలైన ఆదిపురుష్ సినిమా వివాదాల్లో చిక్కుకుంది. భారీ బడ్జెట్ తో రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా పాత్రల పరంగా, సన్నివేశాల పరంగా ప్రేక్షకుల నుంచి విమర్శలు ఎదుర్కొంటూ వివాదాలకు దారితీసింది. అయితే తాజాగా ఆదిపురుష్ రైటర్ హనుమంతుడిపై సంచలన వ్యాఖ్యలు చేసి మరింత అగ్గి రాజేశాడు.
దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడి పాత్రలో, కృతి సనన్ సీత పాత్రలో తెరకెక్కిన ఆదిపురుష్ భారీ అంచనాల నడుమ జూన్ 16న విడుదలైంది. రామాయణం ఆధారంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు ముందే విమర్శలపాలయ్యింది. సినిమాలో రాముడు, సీత, రావణుడు పాత్రలు రామాయణ కథకు తగిన విధంగా లేవంటూ విమర్శలొచ్చాయి. ఆ తరువాత కొన్ని మార్పులు చేసిన డైరెక్టర్ ఓం రౌత్ మళ్లీ సినిమాపై పాజిటివ్ టాక్ వచ్చేలా చర్యలు తీసుకున్నాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఆదిపురుష్ ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. ఇదిలా ఉంటే తాజాగా ఆదిపురుష్ రైటర్ హనుమంతుడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీంతో సినీ ప్రియులు, హనుమంతుడి భక్తులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆదిపురుష్ సినిమాకు మాటల రచయితగా పనిచేసిన మనోజ్ ముంతాషిర్ ఓ ఇంటర్య్వూలో హనుమంతుడు దేవుడు కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో అతనిపై హిందూ భక్తులు, సినీ ప్రేక్షకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ ఇంటర్య్వూలో ముంతాషిర్ మాట్లాడుతూ.. హనుమంతుడు రామ భక్తుడని, ఆ భక్తి వల్లనే ఆయనను దేవుడిలా కొలుస్తున్నామని ముంతాషిర్ తెలిపాడు. ఇప్పటికే పలు వివాదాలతో ఆధరణ తగ్గుతున్న ఆదిపురుష్ సినిమా తాజాగా రైటర్ వ్యాఖ్యలతో ఆదిపురుష్ సినిమా చూసే వారి సంఖ్య తగ్గుతోందంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికైనా జనాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలని మనోజ్ ముంతాషిర్ కు సూచిస్తున్నారు.