పంచముఖ హనుమాన్ బొమ్మను మీ ఇంట్లో ఉంచితే కలిగే ఫలితాలు. హనుమంతుడు శ్రీరాముడికి పరమభక్తుడు, హనుమంతుడు భక్త సులభుడు, అంజనీ సుతుడి కరుణాకటాక్షాలు కలగాలంటే శ్రీరాముడిని పూజించి భజన చేస్తే చాలు భజన చేస్తున్న ప్రదేశంలో హనుమంతుడు ఏదో ఒక అవతారంలో ఉంటాడు అని అని చెప్తుంటారు.’యత్ర యత్ర రఘునాథ కీర్తనంతత్ర తత్ర కృతమస్తకాంజలిం… భాస్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమతః రాక్షసాంతకం… అని అందుకే అంటారు.
శ్రీ మారుతి కృప ఉంటే ఎంతటి జటిలమైన సమస్య అయినా సులువుగా తీరిపోతుంది. మనం చేసే పని విజయవంతం కావాలన్న, కార్యంలో ఉన్న ఆటంకాలు తొలగాలన్నా ఆంజనేయస్వామి వారిని ఒక క్రమ పద్దతిలో ఆరాధించాలి. ఉద్యోగం,వ్యాపారం, ఆరోగ్యం,ధనం మొదలగు యే కోరికైనా మారుతిని ఆరాధిస్తే నెరవేరుతుంది.
ప్రతి రోజు శ్రీ హనుమాన్ చాలీసా ని 11 సార్లు ఒకే ఆసనం మీద కూర్చొని మధ్యలో లేవకుండా చదవాలి. అంటే 11 సార్లు వరుసగా చదవాలి. ప్రారంభం లో 1 గంట పడుతుంది. అలవాటు అయ్యాక 40 నిముషాల్లో పూర్తవుతుంది. 11 సార్లు హనుమాన్ చాలీసా చదివిన తర్వాత ఒక సారి “శ్రీ రామ రక్షా స్తోత్రం” చదవాలి మంగళవారం రోజు ఒక పూట ఉపవాసం ఉండి అన్ని నియమాలు పాటించాలి. మంగళవారం రోజు కొబ్బరికాయను స్వామి వారికి సమర్పించాలి. వీలుంటే నెలకు ఒక మంగళ వారం రోజు ఆకుపూజ ను స్వామి వారికి చేయించాలి. ఈ విధంగా చేస్తూ ఉంటే మీ సమస్యలు ఎంత జటిలమైనవి అయినా క్రమంగా తొలిగిపోతాయి. స్వామి వారి పై పూర్తి విశ్వాసం తప్పనిసరి.
తూర్పుముఖముగా హనుమంతుడు: పాపాలను హరించి, చిత్త సుధ్ధిని కలుగ చేస్తాడు. దక్షిణముఖంగా కరాళ ఉగ్ర నరసింహ స్వామి: శతృభయాన్ని పోగొట్టి, విజయాన్ని కలుగజేస్తాడు. పడమర ముఖంగా మహావీరగరుడ స్వామి, దుష్ట ప్రభావలను పోగొట్టీ, శరీరానికి కలిగే విష ప్రభావలనుండి రక్షిస్తాడు. ఉత్తరముఖముగా లక్ష్మీవరాహమూర్తి గ్రహ చెడు ప్రభావాలను తప్పించి, అష్టైశ్వర్యాలు కలుగజేస్తాడు. ఊర్ధ్వంగా ఉండే హయగ్రీవస్వామి జ్ఞానాన్ని, జయాన్ని, మంచి జీవనసహచరిని, సంతానాన్ని ప్రసాదిస్తాడు. శని, మంగళవారాల్లో ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల, వెన్న సమర్పించిన వారికి సకల సంపదలు చేకూరుతాయి.
అలాగే ఆంజనేయస్వామికి శ్రీరామజయం అనే మంత్రాన్ని 108 సార్లు పేపర్‌పై రాసి మాలగా వేసిన వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని అనుభవజ్ఞులు తెలియజేస్తారు.