మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో RRR సినిమా విడుదల కానుంది. ఈ సినిమా కోసం గతంలో రాజమౌళి భారీ ఎత్తున ప్రమోషన్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే విడుదల వాయిదా పడటంతో అదంతా వృథా అయ్యింది. ఇప్పుడు మార్చి 25న విడుదల కానుండటంతో మళ్లీ ప్రమోషన్స్ జోరందుకున్నాయి. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్, టీజర్లు సినిమాపై భారీ అంచనాలు పెంచేసిన విషయం తిలిసిందే. తాజాగా జెండా పాట కూడా అభిమానుల్లో అంచనాలను పెంచుతోంది. అయితే రామ్ చరణ్– ఎన్టీఆర్ చేతిలో ఉన్న ఆ జెండా ఏంటి? అనే ప్రశ్న ప్రేక్షకుల్లో మొదలైంది. అసలు ఆ జెండా వెనుకున్న అసలు కథ ఏంటో చూద్దాం.
ఇదీ చదవండి: బాహుబలి-3 పై రాజమౌళి క్రేజీ అప్ డేట్! త్వరలోనే అంటూ..
రామ్ చరణ్-ఎన్టీఆర్ చేతిలో ఉన్నది ఇప్పటి మన జెండా కాదు. ఈ కథ స్వాతంత్ర్యానికి ముందు జరిగింది కాబట్టి.. పాటలో కనిపించిన జెండా 1907 సంవత్సరానికి చెందినది. మొదట 1906లో పైభాగంలో కాషాయం, మధ్యలో పసుపు, కింది భాగంలో ఆకుపచ్చతో ఓ జెండాను రూపొందించారు. మధ్యలో వందే మాతరం అని హిందీలో రాసి ఉండేది. ఆ తర్వాత 1907లో పైభాగంలో ఆకుపచ్చ, మధ్యలో పసుపు, కింది భాగంలో ఎరుపు రంగులతో మధ్యలో వందే మాతరం అని హిందీలో రాసిన జెండాను రూపొందించారు. ప్రస్తుతం పాటలో రామ్ చరణ్- తారక్ పట్టుకున్న జెండా అదే.
ఈ జెండా 1907 నుండి 1917 కాలం వరకు మన జెండాగా కొనసాగింది. 1917లో బ్రిటిష్ జెండాను పోలిన ఓ జెండాను రూపొందించారు. మళ్లీ 1921లో తెలుపు, ఎరుపు, ఆకుపచ్చతో మరో జెండాను తయారు చేశారు. దానికి మధ్యలో రాట్నాన్ని ఉంచారు. 1931లో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో రాట్నం గుర్తుతో జెండాను అభివృద్ధి చేశారు. ఇక స్వాతంత్ర్యం తర్వాత అదే జెండాను రాట్నం బదులుగా అశోక చక్రం గుర్తుతో మన జాతీయ జెండాను రూపొందించారు. ఇదండి రామ్ చరణ్- ఎన్టీఆర్ పట్టుకున్న జెండా వెనకున్న అసలు కథ. RRR చిత్రం ఎలా ఉండబోతోంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.