రామ్ గోపాల్ వర్మ.. ఎప్పుడు వివాదాస్పద దగ్గర్లో ఉండే వ్యక్తి. అతను ఏది చేసిన ఓ సెన్సేషన్ అనే చెప్పాలి. ఇటీవల కాలంలో వర్మ బిగ్ బాస్ బ్యూటీస్ అరియానా గ్లోరి, అషూ రెడ్డిలను బోల్డ్ బ్యూటీలో మార్చి ఓ సంచలన ఇంటర్వ్యూ చేశారు. ఇక ఈ ఇంటర్వ్యూలతో వర్మ మరోసారి వివాదాల్లోకి వెళ్లారు. ఇక తరుచు ఏదో రకంగా వివాదాల్లోకి వెళ్తూ అందరినీ తనవైపు తిప్పుకునేందుకు వర్మ చేయని ప్రయత్నాలు లేవనే చెప్పాలి.
అయితే తాజాగా ఆర్జీవీ ఓ వివాదాస్పద బయోపిక్ ను తెరకెక్కించే పనిలో నిమగ్నమయ్యాడని వార్తలు వినిపిస్తున్నాయి. బయోపిక్ లో భాగంగా ఆ నేతల పూర్తి వివరాలను తెలుసుకునేందుకు రామ్ గోపాల్ వర్మ వరంగల్ లో సీక్రెట్ గా పర్యటిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా వరంగల్ లోని LB కళాశాలలో సిబ్బంది, అధ్యాపకులను కలిసి పూర్తి వివరాలను తెలుసుకున్నాడట. అయితే ఒక్కప్పటి వరంగల్ రాజకీయాల్లో కొండా సురేఖ-మురళి దంపతులు ఓ వెలుగు వెలుగి తమదైన ముద్ర వేసుకున్నారు.
ఇక రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన వీళ్లు ప్రజాభిమానాన్ని లాగేసుకున్నారు. అయితే వీరి జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని వర్మ బయోపిక్ ను తెరకెక్కిస్తున్నట్లు ఫిల్మ్ నగర్ లో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. మరి వర్మ నిజంగానే వీరి బయోపిక్ ను రూపొందిస్తున్నాడా అనే ప్రశ్నకు మాత్రం సమాధానం రావాల్సి ఉంది.