మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు మార్చి 27. ఆదివారం ఆయన పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. RRR భారీ విజయం సాధించడంతో మెగా అభిమానులు ఉత్సాహం మరింత పెరిగింది. పండగలాగా చరణ్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. శిల్ప కళావేదికలో రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వరుణ్ తేజ్, మెహర్ రమేష్, బాబీ, చిరంజీవి సోదరి మాధవి, జానీ మాస్టర్ హాజరయ్యారు. ఇక అభిమానులు సైతం భారీ సంఖ్యలో ఈ వేడుకకు హాజరయ్యారు.
ఇది కూడా చదవండి: RRR విజయంపై రామ్ చరణ్ ఎమోషనల్ నోట్!
ఈ వేడుకలో వరుణ్ తేజ్ మాట్లాడుతూ రామ్ చరణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. చెర్రితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. బాల్యంలో వారి మధ్య జరిగిన చిలిపి తగాదాల్ని వివరించారు. చిన్నప్పుడు చరణ్ అన్న తనను బాగా కొట్టేవాడని తెలిపాడు. ఇక RRRలో సినిమా చూస్తుంటే.. స్క్రీన్‌పై చరణ్‌ను చూస్తున్నట్లు లేదని.. అల్లూరి సీతారామారాజును చూస్తున్నట్లు ఉందని తెలిపాడు.
ఇది కూడా చదవండి: రామ్ చరణ్ పుట్టినరోజు.. రాజమౌళి, ఎన్టీఆర్ హంగామా.. వీడియో వైరల్
ఇదే వేదిక మీదుగా వరుణ్ తేజ్ ఇచ్చిన వార్నింగ్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. ‘‘ఎవరన్నా చరణ్ అన్నా గురించి నోరెత్తి ఒక్క మాట మాట్లాడాలంటే.. ముందు మనతో మాట్లాడమనండి. మీ అందరి కంటే ముందే నేను ఉంటాను. మనతో మాట్లాడిన తర్వాత అన్నతో మాట్లాడొచ్చు’’ అంటూ ఇండైరెక్ట్‌గా వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు చరణ్ ఎవరిని ఉద్దేశించి ఈ వార్నింగ్ ఇచ్చాడు అని ఫిల్మ్ నగర్ వాసులు చర్చించుకుంటున్నారు. వరుణ్ తేజ్ కామెంట్స్ మాత్రం వైరలవుతున్నాయి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: ఆర్ఆర్ఆర్ లో యన్టీఆర్ వాడిన వెలిసెట్ బైక్ వెనుక అసలు కథ!