ఆమె సీరియల్ నటి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సుస్మితా సేన్ సోదరుడు రాజీవ్ సేన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక ఇది జరిగిన ఏడాదిన్నరకే విడిపోతున్నట్లు ప్రకటించి అందరికీ షాకిచ్చారు. ఆ తర్వాత కొన్నాళ్లకు బయటకొచ్చి.. కూతురు కోసం కలిసుండాలని అనుకుంటున్నట్లు చెప్పి ట్విస్ట్ ఇచ్చారు. సరే అంతా బాగానే ఉంది అనుకునే టైంలో, కలిసి రెండు నెలలు కూడా కాలేదు.. ఇక పూర్తిగా విడిపోవడానికి రెడీ అయిపోయారు. దీంతో వీళ్ల విడాకుల వ్యవహారం మరోసారి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. 2019లో సుస్మితా తమ్ముడు రాజీవ్ సేన్, సీరియల్ నటి చారు అసోపా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ప్రస్తుతం వారి 11 నెలల కూతురు ఉంది. మరోసారి విడాకుల వ్యవహారం రచ్చ కావడంతో ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చారు పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించింది. తన భర్త వల్ల కెరీర్ పూర్తిగా నాశనమైందని కన్నీరు పెట్టుకుంది. తన ప్రెగ్నెన్సీ సమయంలో రాజీవ్ తనని మోసం చేశాడని ఈ నటి ఆరోపించింది.
‘పెళ్లి జరిగినప్పటి నుంచి రాజీవ్ ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. గొడవలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో మానసికంగా కృంగిపోయాను. గొడవ జరిగినా ప్రతిసారీ కూడా రాజీవ్ నన్ను వదిలి వెళ్లిపోయేవాడు. కరోనా టైంలో కూడా మూడు నెలల దూరంగా ఉన్నాడు. నా ఫోన్ నంబర్లు బ్లాక్ చేశాడు. దీంతో ఆ బాధ నుంచి బయటపడటానికి మళ్లీ పనిపై కాన్సంట్రేట్ చేశాను. ‘అక్బర్ కా బల్ బీర్బల్’ షూటింగ్ కి అటెండ్ అయిన కొన్నిరోజులకే రాజీవ్ తిరిగొచ్చాడు. నా పని విషయంలో జోక్యం చేసుకున్నాడు. తోటీ నటీనటులందరికీ నా గురించి మెసేజ్ లు పెట్టి బెదిరించాడు. దీంతో నన్ను షో నుంచి తీసేశారు. విడాకుల కోసం అప్లయ్ చేస్తే.. బాగా చూసుకుంటానని మాటిచ్చాడు. సరేలే అని డైవోర్స్ వెనక్కి తీసుకున్నాను. అయినా రాజీవ్ తీరు మారలేదు. మళ్లీ వేధించడం స్టార్ట్ చేశాడు. అందుకే ఇప్పుడు అతడితో విడిపోవాలని నిర్ణయించుకున్నాను’ అని చారు కన్నీరు పెట్టుకుంది.