ట్రిపులార్.. ప్రపంచవ్యాప్తంగా మరోసారి ఇండియన్ సినిమా సత్తా చాటిన చిత్రం ఇది. రాజమౌళి మరోసారి దర్శకధీరుడు అని నిరూపించుకున్న చిత్రం ట్రిపులార్ మార్చి 25న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికీ ప్రేక్షకుల హృదయాలు నుంచి, వారి ఆలోచనల్లో నుంచి పోలేదు. ఓటీటీలో విడుదలైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌కు అభిమానులు పెరిగిపోయారు. హాలీవుడ్ ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు.
అయితే ఇప్పుడు ట్రిపులార్ సినిమా అంతర్జాతీయంగా మరోసారి వార్తల్లో నిలిచింది. అదేంటంటే.. శాటర్న్ అంతర్జాతీయ అవార్డుల్లో ట్రిపులార్‌కు నామినేషన్లు దక్కాయి. అంతేకాకుండా తప్పకుండా అవార్డు కూడా దక్కుతుందనే టాక్ వినిపిస్తోంది. బ్యాట్‌మ్యాన్, స్పైడర్ మ్యాన్, టాప్ గన్ వంటి హాలీవుడ్ చిత్రాల సరసన ట్రిపులార్‌కు కూడా నామినేషన్లు దక్కడంపై సర్వత్రా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
యాక్షన్/అడ్వెంచర్ విభాగం, ఇంటర్నేషనల్ ఫిల్మ్ విభాగం, ఫిల్మ్ డైరెక్షన్ లో రాజమౌళి(ట్రిపులార్) ఇలా ట్రిపులార్ సినిమాకి మొత్తం మూడు నామినేషన్లు దక్కాయి. ఏదొక విభాగంలో తప్పకుండా అవార్డు దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గతంలో రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి-2 చిత్రానికి శాటర్న్ అవార్డు దక్కిన విషయం తెలిసిందే. శాటర్న్ అవార్డుల్లో ట్రిపులార్ కు నామినేషన్లు దక్కడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
RRR received 3 nominations at 47th saturn awards including best action film, best international film and best director, huge win for indian cinema. Congratulations to the whole team. #SaturnAwards #RRRMovie #SSRajamouli pic.twitter.com/0OfgBrXaUQ
— Sudhakar Kumar (@iSudhakarkumar) August 13, 2022