ఇదివరకు రీజియన్ సినిమాలు రూపొందేవి.. ఆ తర్వాత ఒక భాష నుండి మరో భాషలో హీరో క్రేజ్ బట్టి రిలీజ్ చేసేవారు. మరిప్పుడు.. ఆ ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. కొంతకాలంగా ఇండియన్ సినిమాల గురించే హాలీవుడ్ లో ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు.
ఇండియన్ సినిమా రోజురోజుకూ ప్రపంచదేశాలకు విస్తరిస్తోంది. ఇదివరకు రీజియన్ సినిమాలు రూపొందేవి.. ఆ తర్వాత ఒక భాష నుండి మరో భాషలో హీరో క్రేజ్ బట్టి రిలీజ్ చేసేవారు. మరిప్పుడు.. ఆ ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. మారుతున్న కాలం, పెరుగుతున్న టెక్నాలజీలతో పాటు ఫిలిం మేకర్స్ ఆలోచనలు సాగుతున్నాయి. ఆ విధంగానే ఫిలిం మేకింగ్ వైపు అడుగులు పడుతున్నాయి. ఒకప్పుడు హాలీవుడ్ సినిమాల గురించి ఇండియన్ ప్రేక్షకులు గొప్పగా మాట్లాడుకునేవారు. హాలీవుడ్ టెక్నాలజీ, అత్యద్భుతమైన సీన్స్.. గ్రాఫిక్స్ మాయాజాలం అన్నీ చూసి ఆశ్చర్యపోయేవారు. ఆయా సినిమాలలో ఒక్కో సీన్ గురించి, డైరెక్టర్స్ గురించి గొప్పగా చర్చించుకొనేవారు.
ఇప్పుడు ఆ రోజులు మారిపోయాయి. కొంతకాలంగా ఇండియన్ సినిమాల గురించే హాలీవుడ్ లో ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఒక బాహుబలి, బాహుబలి 2, కేజీఎఫ్ 2, ఆర్ఆర్ఆర్.. ఇలా ఒక్కో ఇండియన్ సినిమా భారతీయ సినీ చరిత్రని మరో స్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో రాజమౌళి క్రేజ్ వరల్డ్ వైడ్ పాకింది. పైగా మొన్నటిదాకా ఆర్ఆర్ఆర్ పేరు గోల్డెన్ గ్లోబ్ అవార్డులు, ఆస్కార్ బరిలో గట్టిగా వినిపించింది. అదీగాక ఆర్ఆర్ఆర్ కి మొదటి నుండి హాలీవుడ్ ఫిలిం మేకర్స్, పాపులర్ రైటర్స్ నుండి ప్రశంసలు అందుకుంటూనే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా దర్శకుడు రాజమౌళితో ది గ్రేటెస్ట్ హాలీవుడ్ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్ బర్గ్ వీడియో కాల్ లో చర్చించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఆల్రెడీ ఓ ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఈవెంట్ లో హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్స్ స్టీవెన్ స్పిల్ బర్గ్ ను, జేమ్స్ కామరూన్ లను రాజమౌళి కలవడం, ఆర్ఆర్ఆర్ గురించి గొప్పగా మాట్లాడటం జరిగింది. అందరూ అదే పెద్ద అచీవ్ మెంట్ గా భావించారు. కానీ, తాజాగా యూట్యూబ్ లైవ్ ద్వారా స్టీవెన్ స్పిల్ బర్గ్, రాజమౌళి ఇద్దరూ తమ తమ ఇష్టాలతో పాటు సినిమాల గురించి మాట్లాడుకున్నారు. స్పిల్ బర్గ్.. ఆర్ఆర్ఆర్ ను ప్రశంసించడం, సీన్ సీన్ గురించి పొగడటం ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్న విషయం. ఇక స్పిల్ బర్గ్ ని కలిసిన విషయంపై రాజమౌళి స్పందిస్తూ.. స్పిల్ బర్గ్ ను ఇలా కలవడం అద్భుతంగా ఉందని, ఎగిరి గంతేయాలని ఉందని రాజమౌళి చెప్పాడు. ప్రెజెంట్ వీరి వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. ఇది కదా అసలు ఇండియన్ ప్రైడ్ అంటే అని కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. మరి రాజమౌళిని స్పిల్ బర్గ్ మీట్ అవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.
Two Legend directors Single Frame 😍#Rajamouli & #spielberg #Tollywood #Hollywood pic.twitter.com/F5h9fFY8kF
— filmymarket (@filmymarket) February 10, 2023