స్టార్ డైరెక్టర్ రాజమౌళికి మరో అరుదైన గౌరవం. ఇప్పటికే లెక్కలేనన్ని పురస్కారాలు అందుకున్న ఈయన.. ఇప్పుడు మరో ఘనత సాధించారు. ఇంతకీ అదేంటి?
ఇండియన్ సినిమా అంటే కొన్నాళ్ల ముందు వరకు అందరికీ తెలిసింది బాలీవుడ్ మూవీస్ మాత్రమే. కానీ దాన్ని బ్రేక్ చేసిన డైరెక్టర్ రాజమౌళి. తెలుగు సినిమా స్టామినా ఏంటనేది ప్రపంచానికి పరిచయం చేశాడు. గత పదేళ్ల కాలంలో ‘బాహుబలి 1&2’ , ‘ఆర్ఆర్ఆర్’తో శెభాష్ అనిపించాడు. రీసెంట్ గా రాజమౌళి సినిమాకు ఆస్కార్ రావడంతో తన రేంజ్ ఇంకాస్త పెరిగిపోయింది. ఈ క్రమంలోనే లెక్కలేనన్ని అవార్డులు, అరుదైన గౌరవాలు దక్కించుకుంటూనే ఉన్నాడు. తాజాగా ఆ లిస్టులోకి మరో ఘనత చేరింది. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక విషయానికొస్తే.. టాలీవుడ్ గురించి ప్రపంచమంతా మాట్లాడుకుందంటే దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ రాజమౌళి. ‘బాహుబలి’ తనది హాలీవుడ్ రేంజ్ అని ప్రూవ్ చేసుకున్నాడు. అనుకున్నట్లుగానే ‘ఆర్ఆర్ఆర్’తో ఏకంగా ఆస్కార్ గెలిచేసుకున్నాడు. కొన్నాళ్ల ముందు వరకు ఆ హడావుడిలో ఫుల్ బిజీగా ఉన్న జక్కన్న.. రీసెంట్ గా తన కొత్త సినిమాపై దృష్టి పెట్టాడు. సరే ఇదంతా పక్కనబెడితే.. తాజాగా టైమ్స్ మ్యాగజైన్ ‘టాప్-100 వరల్డ్ ఇన్ఫ్లూయెన్సిల్ పీపుల్’ పేరుతో ఓ లిస్ట్ రిలీజ్ చేసింది. ఇందులో రాజమౌళి చోటు దక్కించుకున్నారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ దర్శకుడిగా నిలిచారు. ఇందులో జక్కన్నతోపాటు షారుక్ ఖాన్, ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీ, జడ్జి పద్మలక్ష్మీ.. మన దేశం నుంచి ఇందులో చోటు సంపాదించారు. మరి రాజమౌళికి అరుదైన గౌరవం దక్కడంపై మీరేం అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.
Rajamouli named in TIME’s 100 Most Influential People of 2023
Telugu pride #SSRajamouli has been named by TIME magazine as one among the 100 Most Influential People of 2023. He is the only Indian on the list next to Bollywood superstar Shah Rukh Khan.https://t.co/SIOnaksktk pic.twitter.com/CrR2JryYeN
— idlebrain.com (@idlebraindotcom) April 13, 2023