కార్తికేయ కథానాయకుడిగా శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఆదిరెడ్డి.టి సమర్పణలో ’88’ రామారెడ్డి నిర్మించిన సినిమా “రాజా విక్రమార్క”. ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నవంబర్ 12న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీ సరిపల్లి సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు.
“రాజా విక్రమార్క” సినిమాలో ఎన్ఐఏలో కొత్తగా జాయిన్ అయిన యువకుడిగా కార్తికేయ కనిపిస్తారు. హీరో ఓ వెపన్ డీలర్ దగ్గర సగం ఇన్ఫర్మేషన్ తీసుకుని చంపేస్తాడు. మిగతా ఇన్ఫర్మేషన్ సంగతేంటి? ఏమైంది? అనేది సినిమా. ఈ సీరియస్ స్టోరీలోనే హ్యూమర్ ఫ్యాక్టర్ ఉండేలా చూసుకున్నాను.
నేను సిబిఐ కాలనీ పక్కన ఉండేవాడిని. కిటికీలోంచి చూస్తే ఓ కుర్రాడు కనిపించేవాడు. నేను అతను డ్రైవర్ లేదా చిన్న పోస్టులో పనిచేసే వ్యక్తి అయ్యి ఉంటాడని అనుకున్నాను. తర్వాత ఆయన జేడీ లక్ష్మీనారాయణగారి బృందంలో కీలక సభ్యుడు అని తెలిసింది. నేను అనుకున్నట్టు చాలామంది అనుకుని ఉంటారు కదా! ఆ కోణంలో సన్నివేశాలు రాశాను. ఇక 36గంటల టైమ్ పిరియడ్ లో సాగే ఈ మూవీ క్లయిమ్యాక్స్ రేసీగా ఉంటుందని దర్శకుడు తెలియ చేశాడు. మరి.. ఎన్నో అంచనాల మధ్య విడుదల కాబోతున్న “రాజా విక్రమార్క” ఎలాంటి సక్సెస్ అందుకుంటుందని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.