కార్తికేయ కథానాయకుడిగా శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఆదిరెడ్డి.టి సమర్పణలో ’88’ రామారెడ్డి నిర్మించిన సినిమా “రాజా విక్రమార్క”. ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నవంబర్ 12న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీ సరిపల్లి సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు. “రాజా విక్రమార్క” సినిమాలో ఎన్ఐఏలో కొత్తగా జాయిన్ అయిన యువకుడిగా కార్తికేయ కనిపిస్తారు. హీరో ఓ వెపన్ డీలర్ దగ్గర సగం ఇన్ఫర్మేషన్ తీసుకుని చంపేస్తాడు. […]