రాధికా ఆప్టే.. ఈమె కేవలం హీరోయిన్ మాత్రమేకాదు.. సెన్సేషనల్ హీరోయిన్ అని చెప్పాలి. తెలుగు ప్రేక్షకులు కూడా బాగా సుపరిచితురాలే. బోల్డ్ పాత్రలు, బోల్డ్ డైలాగులతో హిందీలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఫ్యాన్ బేస్‌ని, విమర్శలను సొతం చేసుకుంది. సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్‌లు, ఫొటోషూట్లతోనూ ప్రేక్షకులను, అభిమానులను అలరిస్తూ ఉంటుంది. అయితే ఈమె కాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో బాగా పాపులర్ అయ్యింది. అడపాదడపా తెలుగు చిత్రాల్లో కూడా కనిపించినా.. ఇప్పుడు మాత్రం కేవలం హిందీ చిత్రాలపైనే ఫోకస్ చేస్తోంది. వెబ్ సిరీస్ అవకాశాలను కూడా వదులుకోవడం లేదు.
అయితే కొందరు ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు అని అంటారు కదా? రాధికా ఆప్టే కూడా అలాంటి కోవకు చెందిన ఆమనే చెబుతుంటారు. ఎందుకంటే ఆమె వాటిని పాటిస్తుందో లేదో తెలియదు గానీ, అభిమానులు- శ్రేయోభిలాషులకు మాత్రం సలహాలు ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా లవర్స్- దంపతులకు ఓ సలాహా ఇచ్చింది. అదేంటంటే.. “మీ భాగస్వామితో మీకు గొడవలు జరిగినా, మనస్పర్థలు వచ్చినా కూడా వాటిని వేరే వారితో పంచుకోకండి. మీ మధ్యకు మరెవరినో అనుమతించకండి. మీ విషయాలను వారికి చెప్పడం వల్ల మీకు ఎలాంటి లాభం ఉండదు. ఎందుకంటే మీ సమస్యలకు పరిష్కారం మీరే వెతుక్కోవాలి. అలా చేయడం వల్ల మీ మధ్య దూరం పెరిగే అవకాశం ఉంది” అంటూ చెప్పుకొచ్చింది.
#RadhikaApte #Bollywood #beauty #heroine #fun pic.twitter.com/eT1I3tz4PG
— Beauty Of Cinema (@of_rajr389500) November 3, 2022
అయితే ఈ సలహాలు ఎలా చెబుతున్నావు.. నీ సొంత అనుభవంతోనా? లేక ఎవరి లైఫ్‌లోకి అయినా నువ్వు తొంగి చూశావా? అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అయినా చెప్పేందుకు నీతులు ఉన్నది.. అని ఇంకొందరు రాధికా ఆప్టేపై పెదవి విరుస్తున్నారు. ఇంక సినిమాల విషయానికి వస్తే.. ఈ సంవత్సరంలో ఫారెన్సిక్ అనే థ్రిల్లర్‌లో నటించి మెప్పించి. సెప్టెంబర్ నెలలో హృతిక్ రోషన్ విక్రమ్ వేద సినిమాలోనూ ఆకట్టుకుంది. ప్రస్తుతం మోనికా ఓ మై డార్లింగ్ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా నవంబర్ 11న నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమ్ కానుంది.
Pretty @radhika_apte ♥️#RadhikaApte #TamilCinema #Indiaglitz pic.twitter.com/t5CikcFVj3
— IndiaGlitz – Tamil (@igtamil) November 4, 2022