రాధిక ఆఫ్టే.. సినీ ప్రియులుకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. లెజెండ్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది ఈ బాలీవుడ్ భామ. అనేక విభిన్నమైన పాత్రల్లో నటించి..తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ అమ్మడు సీన్ డిమాండ్ చేస్తే ఎలాంటి క్యారెక్టర్ చేయడానికి కూడా వెనుకాడదు. అయితే ఈ బోల్డ్‌నెస్ వల్ల ఈ అమ్మడు కొన్ని సార్లు ఇబ్బందులను కూడా ఎదుర్కొంది. హిందీలో ప్యాడ్‌మ్యాన్, అంధాదూన్, బద్లాపూర్, గౌల్, సేక్రెడ్ గేమ్స్, ఫొరెన్సిక్ లాంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ‘విక్రమ్ వేదా’ అనే చిత్రంలో రాధిక నటిస్తోంది. సినిమాల గురించి అనేక విషయాలు అప్పుడప్పు షేర్ చేసుకుంటారు. కానీ తన పర్సనల్ విషయాలకు చాలా దూరంగా ఉంటుంది రాధిక. అయితే తాజాగా ఆమె భర్తతో దర్శనమిచ్చిన రాధిక పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఇటీవల రాధిక ఆప్టే ఓ ఇంటర్య్యూలో పాల్గొన్నది. ఈ క్రమంలో “మీరు మీ భర్తతో కలిసి ఎక్కువగా ఫోటోలు దిగరు. ఎందుకు?” అంటూ యాంకర్ అడిగింది. దీనికి రాధిక సమాధానం చెప్తూ… “నేను ఇక్కడ.. నా భర్త బెన్ అక్కడ(యూకే). ఎప్పుడో ఓసారి మాత్రమే కలుసుకుంటాం. నా పని నేనే చేసుకునేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటాను. నా వ్యక్తిగత విషయాలను బయటకు చెప్పడం నాకు ఇష్టం ఉండదు. ఇక ఫోటోల విషయానికోస్తే నాకు ఫోటోలపై అంతగా అభిరుచి లేదు. ఫోటోల విషయంలో నేను కొంత వరకు మేలు.. ఇక బెన్ ఇంకా వేస్ట్. ఫోటోలు అంటే అస్సలు కోపరేట్ చేయ్యడు. అందుకే మా పెళ్లి అయి పదేళ్లు కావోస్తున్న ఇప్పటివరకూ మా పెళ్లి ఫోటోలు కూడా లేవు. మా ఫ్రెండ్స్ లో సంగం మంది ఫోటో గ్రాఫర్లే. అయిన మాకు ఫోటోలు దిగేంత ఆసక్తి కలగలేదు” అంటూ చెప్పుకొచ్చింది.
రాధిక ఆప్టే 2012లోనే బ్రిటిష్ మ్యూజిక్ డైరెక్టర్ బెనెడిక్ట్ టేలర్ ని వివాహం చేసుకుంది. కాగా కెరీర్ పరంగా ముంబైలో రాధిక ఆప్టే ఉంటే, ఆమె భర్త బెనెడిక్ట్ టేలర్ విదేశాల్లో ఉంటాడు. పెళ్లయి పదేళ్లుగా రాధికా ఇక్కడ, బెనెడిక్ట్ ఇంగ్లాండ్ లో ఉంటూ ఎప్పుడో ఒకసారి కలుసుకుంటూ ఇంకా బంధం కొనసాగిస్తున్నారంటే గ్రేట్ అంటున్నారు నెటిజన్లు. తన భర్తపై రాధిక చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.