parched movie: నేటి హీరోయిన్స్ గ్లామర్ కంటే నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలకు జై కొడుతున్నారు. ఎంతటి డీ గ్లామరస్ పాత్రలకైనా ఓకే చెబుతున్నారు. కొంతమంది హీరోయిన్లు బోల్డ్ సీన్లలో నటించటానికైనా వెనకాడటం లేదు. బాలీవుడ్లో ఈ ట్రెండ్ ఎప్పటినుంచో ఉంది. బోల్డ్ సీన్లతో ప్రేక్షకులను, అభిమానులను సైతం ఆశ్చర్యపర్చిన హీరోయిన్లలో రాధికా ఆప్టే ముందు వరుసలో ఉంటారు. సాక్రెడ్ గేమ్స్, పర్చెద్, లస్ట్ స్టోరీస్‌లలో ఆమె నటించిన తీరు విమర్శకులను సైతం ఆలోచింపచేసింది. రాధిక మొదటినుంచి గ్లామర్ కంటే నటకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేస్తూ ఉన్నారు. తాజాగా, ఆమె తన పాత్రకు సంబంధించిన ఓ ఫొటోను ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేశారు.
ఆ ఫొటోను చూసి నెటిజనులు షాక్ తింటున్నారు. కొంతమంది ఆ ఫొటోలో ఉన్నది ఎవరో కనుక్కోవటానికి కష్టపడుతున్నారు. అంత దారుణమైన లుక్‌లో ఉన్నారామె. సగం కత్తిరించిన జుట్టు, మాసిపోయిన బట్టలతో బిచ్చగత్తెలాగా కనిపిస్తున్నారు. ఆ ఫొటో 2016లో వచ్చిన ‘‘పర్చెద్’’ సినిమా లోనిది. ఈ సినిమాలో గుజరాత్ గ్రామీన యువతిగా నటించారామె. ఆదిల్ హుస్నెన్తో కలిసి బోల్డ్ సీన్స్‌లో నటించారు. ఆ సీన్లు అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించాయి. రాధిక ఆప్టే ఫొటోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : ‘నా భార్య నా రక్తం తాగుతోంది.. ట్రీట్మెంట్ ఉందా’.. సోనూ సూద్ రిప్లై వైరల్!