గతంలా కేవలం పాటలకే, కొన్ని సీన్లకు పరిమితం కావడం లేదు నేటీ నటీమణులు . కథకు, కథానాయిక పాత్రకు ప్రాధాన్యతనిస్తున్నారు. తమకు నచ్చకపోతే.. సినిమా నుండి తప్పుకునేందుకు కూడా వెనుకాడటం లేదు. పరిశ్రమలో ఉన్న సమస్యలపై కూడా మాట్లాడుతున్నారు. అటువంటి వారిలో రాధికా ఆప్టే ఒకరు.
ఇటీవల కాలంలో సినిమా ఎంపికలో నటీమణుల తీరు పూర్తిగా మారింది. గతంలా కేవలం పాటలకే, కొన్ని సీన్లకు పరిమితం కావడం లేదు. కథకు, కథానాయిక పాత్రకు ప్రాధాన్యతనిస్తున్నారు. తమకు నచ్చకపోతే.. కుండబద్ధలు కొట్టినట్లు చెప్పేస్తున్నారు. అవసరమైతే సినిమా నుండి తప్పుకునేందుకు కూడా వెనుకాడటం లేదు. అలాగే సినిమా పరిశ్రమలో జరుగుతున్న కౌస్టింగ్ కౌచ్, రెమ్యునరేషన్, హీరో డామినేషన్ వంటి పలు సమస్యలపై అనేక మంది నటీమణులు గళం విప్పుతున్నారు. అటువంటి వారిలో ఒకరు రాధికా ఆప్టే. బోల్డ్ సీన్లలోనే కాదూ.. ముక్కుసూటిగా మాట్లాడే తత్వం ఆమెదీ. తాజాగా మరోసారి హాట్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది.
రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర సినిమాతో కోలీవుడ్, టాలీవుడ్ పరిశ్రమలోకి ఒకేసారి అడుగుపెట్టిందీ ఈ సెన్సేషనల్ చిన్నది. ఆ తర్వాత తెలుగులో బాలయ్య బాబుతో లెజెండ్, లయన్ వంటి సినిమాలు చేసింది. అనంతరం బాలీవుడ్, హలీవుడ్ సినిమాలతో బిజీగా మారిపోయింది. హీరోలతో సమానంగా హీరోయిన్లకు రెమ్యునరేషన్ ఇవ్వాలని ఎప్పటి నుండో డిమాండ్ చేస్తోంది. కాగా, తాజాగా సమానత్వం గురించి ఓ భేటీలో మాట్లాడింది. ఆడ, మగ.. ఇద్దరూ వృత్తిలో సమానంగా సంపాదిస్తుండగా.. ఉద్యోగం ముగించుకుని ఇంటికి రాగానే బాధ్యతలు భుజాన వేసుకుని, కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చుతుంది. ఇదేనా సమానత్వం అంటూ ప్రశ్నించింది.
‘నా తండ్రికి ఆసుపత్రి ఉండేది. అందులో తన తల్లి కూడా సేవలు అందించేవారు. అయితే ఇంటికి రాగానే కుటుంబ బాధ్యతలు కూడా నిర్వహించేది. ఇంట్లో అనందరికి అవసరమైనవన్నీ సమకూర్చేది. ఇలా ఆడవారే ఇంటి పనులు చేయాలని వారి బాల్యం నుంచే అలవాటు చేస్తున్నారు. అదే కొనసాగుతుంది. మహిళలు అంతగా త్యాగం చేయాల్సిన అవసరం లేదు. కుటుంబంలోని వారంతా తలా ఒక పనిచేస్తే సరిపోతుంది’ అంటూ రాధిక ఆప్టే పేర్కొంది.