టైటానిక్.. సినీ జగత్తులో ఎప్పటికీ నిలిచిపోయే ఓ అద్భుతమైన ప్రేమ కథ. ఓ భారీ విషాదంలో.. ఓ సున్నితమైన ప్రేమ కథని జోడించి, దర్శకుడు జేమ్స్ కామెరాన్ సిల్వర్ స్క్రీన్ పై అద్భుతాన్ని సృష్టించాడు. టైటానిక్ విడుదల అయ్యి 24 సంవత్సరాలు అవుతోంది. అయినా.. జాక్, రోజ్ ప్రేమకథని ప్రేక్షకులు ఇప్పటికీ మరచిపోలేకపోతున్నారు.
నిజానికి టైటానిక్ ప్రమాదంలో 1500 మందికి పైగా ప్రాణాలను కోల్పోయారు. జేమ్స్ కామెరాన్ ఈ దృశ్యాలను అత్యంత హృదయ విదారకరంగా చిత్రీకరించారు. కానీ.., ప్రేక్షకులకు మాత్రం జాక్, రోజ్ ప్రేమకథకే కనెక్ట్ అయ్యారు. క్లైమ్యాక్స్ లో ఆ చెక్క బల్లపై.. జాక్ కి కాస్త ప్లేస్ కల్పించి అతన్ని కూడా బతికించి ఉండొచ్చు కదా అని.. దర్శకుడు జేమ్స్ కామెరాన్ ని ఇప్పటికీ తిట్టిపోసే అభిమానులు లేకపోలేదు. ఇది టైటానిక్ స్థాయి. ఆనాటి నుండి నేటి వరకు టైటానిక్ ని కొట్టే లవ్ స్టోరీ సిల్వర్ స్క్రీన్ పై ప్రత్యక్షం కాలేదు. కానీ.., ఇప్పుడు తొలిసారిగా ఆ అద్భుతం జరగబోతుందా? ప్రభాస్ “రాధేశ్యామ్” ఆ అద్భుతం కాబోతుందా? అలనాటి జాక్, రోజ్ ప్రేమకథని మించేలా.. రాధేశ్యామ్ లో విక్రమ్ ఆదిత్య, ప్రేరణ లవ్ స్టోరీ ఉండబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అయితే.. ఇక్కడ రాధేశ్యామ్ చిత్రానికి మూలం మాత్రం మన రాధాకృష్ణుల ప్రేమకథే!
చరిత్రలో రాధాకృష్ణుల ప్రేమ కన్నా గొప్ప ప్రేమ కథ మరొకటి లేదు. 8 ఏళ్ళ వయసులోనే శ్రీకృష్ణుడు రేపల్లెలో రాధ ప్రేమని పొందుతాడు. ఇద్దరు ఒకరిని ఒకరు అమితంగా ఆరాధించుకుంటారు. కానీ.., మీకు తెలుసా? వీరిద్దరూ పెళ్లి చేసుకోలేదు! మరి.., రాధని ప్రాణంగా ప్రేమించిన కృష్ణుడు ఆమెకి ఎందుకు దూరం అయ్యాడు? దీనికి ప్రత్యేక కారణం ఉంది? శ్రీకృష్ణుడు రాధ ప్రేమలో పడిన సమయంలో ఆయన కేవలం గోపబాలుడు మాత్రమే. తరువాత కాలంలో ఆయన ధర్మ రక్షణార్థం చాలా యుద్దాలు చేయాల్సిన అవసరం ఉంటుంది.
ఇలాంటి తన జీవితంలోకి రాధని ఆహ్వానించడానికి శ్రీకృష్ణుడు ఇష్టపడడు. పైగా.. రాధకి గత జన్మ శాపం ఉంటుంది. ఆ శాపం ప్రకారం.. ఆమె కృష్ణుడిని పెళ్లాడినా, ఆయనకి దూరం కాక తప్పదు. అంటే తనతో పెళ్లి జరిగితే రాధకి మరణం తప్పదని కృష్ణుడికి ముందే తెలుస్తుంది. కాబట్టి.. రాధని కాపాడుకోవడానికే శ్రీకృష్ణుడు ఆమెని మనువు ఆడకుండా దూరంగా ఉండిపోతాడు. కానీ.., రాధ ఆత్మని మాత్రం కృష్ణుడు తనలో ఐక్యం చేసుకున్నాడు. అలా రాధకి దూరమయ్యి.. శ్రీకృష్ణుడు జీవితమంతా బాధని భరించాడు. ఇందుకే రాధాకృష్ణుల ప్రేమ పూర్తి భిన్నమైంది. వారు ఒకరి కోసం ఒకరు కాదు, ఇద్దరూ ఒక్కటే.
మన రాధాకృష్ణుల ప్రేమకథే..”రాధేశ్యామ్” కథకి మూలం. కాకుంటే.. ఒక్కటే ఒక్క మార్పు. రాధ మరణం తధ్యమని తెలిసిన శ్రీకృష్ణుడు ఆమెని రక్షించుకోవడానికి దూరంగా ఉండిపోతాడు. ఇక్కడ ప్రేరణ మరణం తధ్యమని తెలిసి.. విక్రమ్ ఆదిత్య ఆమెని కాపాడుకోవడానికి ఆమెకి దగ్గర అవుతాడు. ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ వీడియోస్ ని జాగ్రత్తగా గమనిస్తే ఈ విషయం స్పష్టంగా అర్ధం అవుతుంది.
వేరే గ్రహం మీద నుండి భూ గ్రహం మీదకి వచ్చిన విక్రమ్ ఆదిత్యకి మనుషుల ఫ్యూచర్ తెలుసుకునే శక్తి ఉంటుంది. ఇందుకే విక్రమ్ ఆదిత్య అందరి జాతకాలను చెప్పగలడు. కానీ.., ఆ జరిగే రాతని మాత్రం మార్చలేడు. ఈ క్రమంలో అతనికి ఇటలీలో ఓ అమ్మాయి నచ్చుతుంది. ఆమె పేరు ప్రేరణ. ఆమెతో పీకల్లోతు ప్రేమలో పడతాడు విక్రమ్ ఆదిత్య. కానీ.., ప్రేరణ చుట్టూ సమస్యలు. వాటి వల్ల ప్రేరణ మరణం తప్పదు! అదే రాత!
ఈ విషయం విక్రమ్ ఆదిత్యాకి ముందే తెలిసిపోతుంది. కానీ.., విక్రమ్ తన ప్రియురాలి కోసం జరగబోయే దాన్ని మార్చాలి అనుకుంటాడు. ఇందుకోసం అతను ఎవరిని ఎదిరిస్తాడు? తన ప్రేమ కోసం ఎలాంటి కష్టాలు పడతాడు? చివరికి తన ప్రియరాలిని కాపాడుకున్నాడా? లేదా? అన్నదే రాధేశ్యామ్ స్టోరీగా తెలుస్తోంది. చివరికి ఈ భూమిపై విధాత రాతని మార్చలేని విక్రమ్ ఆదిత్య.. ప్రేరణని సజీవంగా తమ గ్రహంపైకి తీసుకెళ్ళడంతో రాధేశ్యామ్ కథకి ఓ పాజిటివ్ ఎండింగ్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. తాజాగా విడుదలైన “ఎవరో.. వీరెవరో” పాటలో మనం ఈ విజువల్స్ చూడవచ్చు కూడా.
ఇప్పుడు టైటానిక్ కి రాధేశ్యామ్ కి పోలిక చూద్దాం. అక్కడ జాక్- రోజ్ మధ్య సామాజిక స్థాయి అన్నది అడ్డంకి. ఇక్కడ విక్రమ్ ఆదిత్య- ప్రేరణ మధ్య రెండు వేరు వేరు గ్రహాల నేపధ్యం అడ్డంకి. టైటానిక్ కథని కీలక మలుపు తిప్పేది ఆ షిప్ యాక్సిడెంట్. రాధేశ్యామ్ లో ట్రైన్ యాక్సిడెంట్ కూడా ఇలాంటి కీ పాయింట్ అని తెలుస్తోంది.
టైటానిక్ లో గాని, రాధాకృష్ణుల ప్రేమకథలో గాని విషాదంతమైన ఎండింగ్ తప్పలేదు. కానీ.., రాధేశ్యామ్ లో విక్రమ్ ఆదిత్య, ప్రేరణ ఇద్దరు కూడా విధి రాతని దాటుకుని తమ ప్రేమని నిలబెట్టుకుంటారు. సో.. ఇలా ఏ లెక్కన చూసుకున్నా టైటానిక్ కన్నా, రాధేశ్యామ్ బ్యాక్ డ్రాప్, గ్రాఫ్ హై లెవల్ లో కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే గనుక నిజమైతే సిల్వర్ స్క్రీన్ పై టైటానిక్ ని మించిన అద్భుతం జరగడం ఖాయంగా కనిపిస్తోంది. మరి.. రాధేశ్యామ్ మూవీ ఈ స్థాయిలో ఉండబోతుందని మీకు అనిపిస్తుందా? ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.