సినీ అభిమానులు మొన్నటివరకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన పాన్ ఇండియా సినిమాలలో ‘రాధేశ్యామ్‘ ఒకటి. ప్రభాస్, పూజాహెగ్డే జంటగా నటించిన ఈ పీరియాడిక్ లవ్ స్టోరీ.. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. టీజర్స్, సాంగ్స్, ట్రైలర్స్ తో అంచనాలు పెంచేసిన రాధే శ్యామ్ మూవీ ప్రస్తుతం విజయవంతంగా థియేటర్లలో రన్ అవుతోంది. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరగడంతో రాధేశ్యామ్ కలెక్షన్స్ కూడా అదే రేంజిలో ఉంటాయని అంచనా వేస్తున్నారు.
ఇక పామిస్ట్రీ(హస్తసాముద్రికత) నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా పై అంచనాలు పెరగడానికి ప్రధాన కారణాలలో ఇది ఒకటి. ఈ సినిమాలో అందమైన లవ్ స్టోరీతో పాటు, 1970ల కాలంలో జరిగిన ఓ ప్రముఖ పామిస్ట్ లైఫ్ స్టోరీ గురించి కూడా ప్రస్తావించినట్లు సమాచారం. అయితే.. సినిమా రిలీజ్ అయ్యేసరికి ఇదంతా నిజమా కాదా? అనే సందేహాలు అందరిలో నెలకొన్నాయి. అందుకు కారణం కూడా డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్. రాధేశ్యామ్ లో పామిస్ట్రీ నేపథ్యం ప్రముఖ పామిస్ట్ లైఫ్ స్టోరీ నుండి స్ఫూర్తి పొందినట్లు చెప్పేసరికి సినిమాపై అందరిలో ఆసక్తి ఏర్పడింది.
అప్పటినుండి రాధేశ్యామ్ పామిస్ట్ పాత్రకు స్ఫూర్తి అయిన పర్సన్ ఎవరా అని ఆరా తీయడం మొదలుపెట్టారు. అతను ప్రముఖ ఐరిష్ హస్త సాముద్రిక నిపుణుడు చిరో.. ఆయన అసలు పేరు విలియమ్ జాన్ వార్నర్. అప్పట్లో కొన్నేళ్లు ఇండియాలో పామిస్ట్రీ నేర్చుకుని తర్వాత లండన్ కి వెళ్ళిపోయాడట. అయితే.. ‘రాధేశ్యామ్’ లాస్ట్ 20 నిమిషాల సన్నివేశం లండన్ లోనే చిత్రీకరించారట. డైరెక్టర్ రాధాకృష్ణ ‘రాధేశ్యామ్’ స్టోరీ పాయింట్.. 15 ఏళ్ల క్రితమే తన గురువు చంద్రశేఖర్ ఏలేటి దగ్గర నుంచి తీసుకున్నాడు.
చాలాయేళ్లు ఆ స్టోరీ పాయింట్ ని డెవలప్ చేసుకుంటూ వచ్చి, అనేకమంది రచయితలతో చర్చించాక ఫైనల్ స్క్రిప్ట్ రెడీ చేశాడు. సినిమాలో ఇంటర్వల్ సీక్వెన్స్.. క్లైమాక్స్ లో వచ్చే గ్రాఫిక్ సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయని టాక్ వచ్చింది. ఇదిలా ఉండగా.. పామిస్ట్రీ నిపుణుడు చిరో ఎన్నో పుస్తకాలు రచించారు. ఇండియాలోనే హస్తసాముద్రికం, జ్యోతిష్యం మరియు కల్దీయన్ సంఖ్యాశాస్త్రాన్ని నేర్చుకున్నానని స్వయంగా తెలిపారు.
1866లో పుట్టిన చిరో.. 1936లో మరణించాడు. కానీ అతని లైఫ్ లో పామిస్ట్రీ పై, భవిష్యత్ పై, జ్యోతిష్యం పై, సైన్స్ పై ఎన్నో పుస్తకాలూ రాశారు. చిరో గురించి ప్రపంచం అంతా రాధేశ్యామ్ ద్వారా మరోసారి గుర్తు చేసుకుంటుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి రాధేశ్యామ్ లో ప్రభాస్ పోషించిన విక్రమాదిత్య క్యారెక్టరైజేషన్ కి రియల్ హీరో చిరో అని తెలుస్తుంది. మరి ప్రభాస్ విక్రమాదిత్య క్యారెక్టర్ పై, పామిస్ట్ చిరో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.