వింటేజ్ ప్రేమకథా చిత్రంగా ప్రభాస్ హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం రాధే శ్యామ్. రాధాకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కించారు మేకర్స్. సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ వాయిదా పడిన తర్వాత రాధేశ్యామ్ విడుదలను వాయిదా వేయమని చిత్ర యూనిట్ ప్రకటించినప్పటికీ.. చివరి క్షణంలో తాము కూడా చిత్రాన్ని ప్రేక్షకులకు ముందుకు తీసురాలేకపోతున్నామని ప్రకటించారు.
We have to postpone the release of our film #RadheShyam due to the ongoing covid situation. Our sincere thanks to all the fans for your unconditional love and support. pic.twitter.com/cC18q8jmOz
— Radhe Shyam (@RadheShyamFilm) January 5, 2022
ఇదిలా ఉంటే ఈ సినిమా కొత్త విడుదల తేదీపై చిత్ర యూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ.. తాజాగా రాధేశ్యామ్ విడుదల తేదీ ఇదేనంటూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది. మార్చి నాటికి కరోనా ప్రభావం తగ్గుతుందని నిపుణులు అంచనా వేస్తున్న నేపథ్యంలో రాధేశ్యామ్‌ను థియేటర్లలోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మార్చి 18 న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట యూవీ క్రియేషన్స్.
#RadheShyam kosam chaala edits chesanu ❤️💗@director_radhaa okasari na edits chudochga 🥲😁#Prabhas @RadheShyamFilm pic.twitter.com/TRnikMGOSD
— Siva Harsha || S/H 🤙🎥 (@SivaHarsha_1) December 31, 2021
70ల కాలం నాటి ఇటలీ నేపథ్యంగా సాగే ప్రేమకథతో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ పూర్తిస్థాయి లవర్‌బాయ్ పాత్ర పోషించారు. ఇందులో ప్రభాస్ విక్రమాదిత్య అనే హస్తసాముద్రిక నిపుణుడి పాత్రలో కనిపించనున్నారు. ‘బాహుబలి’, ‘సాహో’ వంటి యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ తర్వాత ప్రభాస్ నటిస్తున్న ‘రాధేశ్యామ్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
అయితే ఫిబ్రవరిలో భీమ్లా నాయక్ గా పవన్ కళ్యాణ్ బారి ఉండగా, ఏప్రిల్ లో ఆచార్య, సర్కారు వారి పాట క్యూ కట్టాయి. వారితో ఇబ్బంది ఎందుకని మార్చి నెలలో బావుంటుందని మేకర్స్ అబిప్రాయపడుతున్నారట.
Hello all!! Here are some working stills of our darlings #Vikramaditya and #Prerana from #radheshyam !! Let’s all stay low to come back stronger🤗🤗 pic.twitter.com/cqiSBjsa74
— Radha Krishna Kumar (@director_radhaa) January 10, 2022