సినిమా ఇండస్ట్రీకి రావాలంటే ఎన్నో కష్టాలు, ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఈరోజు స్టార్లుగా కొనసాగుతున్న వారంతా ఒకప్పుడు ఎన్నో ఇబ్బందులు పడ్డవాళ్లే. అయితే కొంతమంది మాత్రం తమతో పాటు కష్టాల్లో ట్రావెల్ అయిన వాళ్ళని గుర్తుపెట్టుకుంటారు. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం.. ఆరోజు ఆ వ్యక్తితో కలిసి పని చేయడం వల్లే కదా అన్న ఆలోచన ఉంటుంది. ఆరోజు తనతో పాటు స్ట్రగుల్స్ ఫేస్ చేసిన వాళ్ళని గురుపెట్టుకుని.. వాళ్ళకి లైఫ్ ఇవ్వాలనుకునే వ్యక్తులు ఉంటే వారికన్నా గొప్పవాళ్ళు మరొకరు ఉండరు. అలాంటి గొప్ప వాళ్లలో సుహాస్ ఒకరు. కలర్ ఫోటో సినిమాతో హీరోగా తనకంటూ ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ని సెట్ చేసుకున్న సుహాస్.. గుర్తుపెట్టుకుని మరీ మనుషులకు సహాయం చేస్తున్నారు.
ఛాయ్ బిస్కెట్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా పరిచయం అయిన సుహాస్.. షార్ట్ ఫిల్మ్ లు ద్వారా తన నటనతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. యూట్యూబ్ వీడియోలు చేస్తూ.. సినిమాలు, వెబ్ సిరీస్ లలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ.. ఇవాళ హీరో స్థాయికి ఎదిగారు. కలర్ ఫోటో సినిమాతో హీరోగా నటించిన సుహాస్.. గుండెల్ని పిండే నటనతో ఎంతగా ఆకట్టుకున్నారో అందరికీ తెలిసిందే. సుహాస్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. క్లాసు, మాసు తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సుహాస్ నటనకు అభిమానులైపోయారు. కలర్ ఫోటో తర్వాత.. రంగ్ దే, గమనం, హిట్ 2 వంటి సినిమాల్లో నటించారు. కలర్ ఫోటో సినిమాతో ఏడిపించేసిన సుహాస్.. ప్రస్తుతం రైటర్ పద్మభూషణ్ అనే కామెడీ కథతో మనల్ని నవ్వించేందుకు సిద్ధమయ్యారు.
రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ప్రమోషన్ లో చిత్ర నిర్మాతల్లో ఒకరైన శరత్ చంద్ర.. సుహాస్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సుహాస్ లో ఉన్న గొప్ప లక్షణాలను ఆయన బయటపెట్టారు. తాను ఇబ్బందుల్లోనూ, కష్టాల్లోనూ ఉన్నప్పుడు ఎవరైతే తనకు తోడుగా ఉన్నారో.. వారిని గుర్తుపెట్టుకుని వాళ్ళని సెటిల్ చేయాలన్న ఆలోచనతో సుహాస్ ఉండేవారని అన్నారు. ఇండస్ట్రీకొచ్చిన కొత్తలో షార్ట్ ఫిల్మ్స్ తీయడానికి తనతో పాటు స్ట్రగుల్ అయిన దర్శకులు ఎవరైతే ఉన్నారో.. వాళ్లందరినీ నిర్మాతల దగ్గరకు తీసుకెళ్లి సినిమాలు ఇప్పించే గుణం సుహాస్ దని అన్నారు.
తన దగ్గరకు ఒకర్ని, గీతా ఆర్ట్స్ దగ్గరకు మరొక దర్శకుడ్ని.. ఇలా అందరినీ నిర్మాతలకు పరిచయం చేసి సినిమాలు చేస్తున్నారని వెల్లడించారు. రైటర్ పద్మభూషణ్ సినిమా తర్వాత సుహాస్ చేయబోయే సినిమా కూడా అలా స్ట్రగుల్ అయిన దర్శకుడితోనే చేస్తున్నారని అన్నారు. ఎంత గొప్ప లక్షణమో కదా. వచ్చిన దారిని, సాయం చేసిన మనుషుల్ని.. కలిసి ప్రయాణం చేసిన వ్యక్తులను, కష్టాలు పంచుకున్న వ్యక్తులను మర్చిపోయే వ్యక్తులకు భిన్నంగా ఇలా.. తన కెరీర్ ప్రారంభంలో తనతో పాటు ట్రావెల్ చేసిన వారిని గుర్తుపెట్టుకుని మరీ వాళ్ళకి లైఫ్ ఇవ్వడం అంటే గొప్ప విషయమే. కింద నుంచి వచ్చిన వ్యక్తి కదా.. దారి గుర్తుంది కాబట్టి మర్చిపోలేదు. మరి సుహాస్ వ్యక్తిత్వంపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి.