కేజీఎఫ్.. ఈ సినిమా సృష్టించిన సంచలనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కన్నడ రాక్ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ఊహకందని విజయాన్ని సాధించింది. చిన్న చిత్రంగా విడుదలై ఓవర్ నైట్ లోనే సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఈ దెబ్బతో యశ్ క్రేజ్ దక్షిణాది నుంచి ప్రపంచ వ్యాప్తంగా పాకిపోయింది. ఇక ఈ మూవీతోనే యశ్ పాన్ ఇండియా స్టార్ గా కూడా మారిపాయాడు.
ఇక ఈ మధ్యకాలంలో KGF-2 పాన్ ఇండియా చిత్రంగా విడుదలై ఇప్పటికీ రూ. 1000 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. KGF సినిమా అంటే దానిని తలదన్నేలా ఉన్న ఈ మూవీ బక్సాఫీసు వద్ద భారీ వసూలు రాబట్టింది. ఇదిలా ఉంటే చాప్టర్ 2లో KGF-3 కూడా ఉండబోతుందనే రీతిలో ఓ హింట్ కూడా ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇదే విషయంపై డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గతంలో అనేక ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ.. KGF- చేసే ఉద్దేశం లేదన్న వ్యాఖ్యలు చేశాడు.
ఇది కూడా చదవండి: Ram Gopal Varma: రాజకీయాల్లోకి ఎంట్రీ ఎప్పుడు.. RGV రియాక్షన్ వైరల్!దీంతో KGF అభిమానులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. పాన్ ఇండియా లెవల్లో తీసిన ఈ చిత్రం ఘన విజయాన్ని సాధించడంతో ఖచ్చితంగా KGF-3 ఉండబోతుందని అనుమానాలు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఇక చాప్టర్ 3 రాదేమోనన్న నిరుత్సాహంలో ఉన్న అభిమానులకు KGF నిర్మాత తాజాగా కిక్కి్చ్చే న్యూస్ ను అందించాడు. కాగ తాజాగా KGF-3 సినిమాపై నిర్మాత ఓ సర్ ప్రైజ్ ఇచ్చాడు.
ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ చేస్తున్నాడు. ఈ మూవీ నవంబర్ నాటికి పూర్తవ్వొచ్చని ఆ తర్వాత డిసెంబర్ KGF-3ని స్టార్ట్ చేయనున్నట్లుగా తెలిపినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. 2023 సినిమాను మొదలు పెట్టి 2024 లో విడుదలకు ప్లాన్ చేయనున్నామని నిర్మాత విజయ కిరగందూర్ అన్నారు. ఇక తాజాగా నిర్మాత వ్యాఖ్యలతో KGF పండగ చేసుకుంటున్నారు. KGF-3పై నిర్మాత చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.