తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం గిల్డ్‌తో పాటు ఫిలిం ఛాంబర్ ఆగస్టు నెలలో షూటింగ్‌లను నిలిపి వేసిన సంగతి తెలిసిందే. ఆగస్టు 1నుంచి దాదాపు 30 రోజుల పాటు పరిశ్రమలో షూటింగ్‌లు నిలిచిపోయాయి. ఈ షూటింగ్‌ల బంద్ ఎపిసోడ్ ముగిసి నెలలు గడుస్తోంది. ఈ నేపథ్యంలో షూటింగ్‌ల బంద్‌పై ప్రముఖ సినీ నిర్మాత సీ కల్యాణ్ సంచలన కామెంట్లు చేశారు. నిర్మాత దిల్ రాజుపై కూడా ఆయన కామెంట్లు చేశారు. 30 రోజులు పరిశ్రమను మూసేయటం అనేది ఓ అట్టర్ ప్లాప్ అని అన్నారు. 4-5 మీటింగులలోనే తనకు ఆ విషయం అర్థం అయిపోయిందని చెప్పారు.
గిల్డ్‌కు గుర్తింపులేదని, అదో వేస్ట్ అంటూ ఫైర్ అయ్యారు. నిర్మాత దిల్ రాజు పరిశ్రమకు ఉపయోగపడే నిర్ణయం ఎప్పుడూ తీసుకోలేదని స్పష్టం చేశారు. కాగా, షూటింగ్స్ బంద్ సమయంలో కొన్ని విషయాల్లో గందరగోళం నడిచింది. ప్రముఖ తమిళ హీరో దళపతి విజయ్ హీరోగా.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మిస్తున్న ‘వారసుడు’ సినిమాతో పాటు.. ధనుష్ హీరోగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న ‘సార్’ చిత్రం కూడా బంద్ సమయంలోనూ షూటింగ్ జరుపుకున్నాయి. ఈ రెండిటితో పాటు మరికొన్ని సినిమాలు కూడా షూటింగ్‌ను కొనసాగించాయి.
దీనిపై చిన్న సినిమా నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకో న్యాయం.. మీకో న్యాయమా అంటూ మండిపడ్డారు. అయితే, దీనిపై సదరు సినిమాల నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. తమిళ, తెలుగు ద్విభాషా చిత్రాలకు సంబంధించి తమిళ వెర్షన్ షూటింగ్స్ మాత్రమే చేస్తున్నామని స్పష్టం చేశారు. ఆగస్టు 4న సీ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ కరోనా తర్వాత నిర్మాతలకు ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు షూటింగ్స్‌ను నిలిపివేశాము. మరో పది రోజుల్లో సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. నిర్మాతలెవరూ బయట జరిగే ప్రచారాన్ని నమ్మ వద్దు. నిర్మాతల మధ్య ఎలాంటి అభిప్రాయ బేధా లేవు’’ అని అన్నారు.
30 Days Industry Close anedhi Utter Flop. 4-5 meetings lone adhi naku thelisipoindhi appudu.
Guild anedhi Total ga Unrecognized and Waste. Industry ki Upayogapade decision Dil Raju eppudu theeskoledhu.
– C Kalyan #Mirchi9LIVE pic.twitter.com/aUNZ8NlxTr
— MIRCHI9 (@Mirchi9) December 8, 2022