పాన్ ఇండియా స్టార్డమ్ వచ్చాక హీరోల నుండి చకచకా సినిమాలు వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటారు. కానీ.. పాన్ ఇండియా సినిమాలు కదా.. హీరోలు ప్రతి విషయంలో జాగ్రత్త పడుతుంటారు. ఎందుకంటే.. వచ్చిన పాన్ ఇండియా స్టేటస్ ని కాపాడుకోవాలని, ఫ్యాన్స్ అంచనాలకు తగ్గకుండా ఉండేలా ప్లాన్ చేస్తుంటారు. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ అదే పనిలో ఉన్నాడు.
పాన్ ఇండియా స్టార్డమ్ వచ్చాక హీరోల నుండి చకచకా సినిమాలు వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటారు. కానీ.. పాన్ ఇండియా సినిమాలు కదా.. హీరోలు ప్రతి విషయంలో జాగ్రత్త పడుతుంటారు. ఎందుకంటే.. వచ్చిన పాన్ ఇండియా స్టేటస్ ని కాపాడుకోవాలని, ఫ్యాన్స్ అంచనాలకు తగ్గకుండా ఉండేలా ప్లాన్ చేస్తుంటారు. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ అదే పనిలో ఉన్నాడు. ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా క్రేజ్ వచ్చాక.. దర్శకుడు కొరటాల శివతో ‘NTR30’ మూవీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఆ కొరటాలతో సినిమా గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ఏడాది కాలంగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ ఎట్టకేలకు మూవీ లాంచ్ అవ్వడంతో సంతోషించారు.
కోస్టల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ చాలా పవర్ ఫుల్ రోల్ లో కనిపించనున్నాడని చెప్పి దర్శకుడు కొరటాల అంచనాలు పెంచేశాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటిస్తోంది. అయితే.. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్.. కేజీఎఫ్, సలార్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా చేయనున్నాడు. అది మైత్రి మూవీస్ బ్యానర్ లో రూపొందనుంది. అయితే.. ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత ఎన్టీఆర్.. బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ తో ఓ సినిమా చేయనున్నాడని కొత్తగా టాక్ మొదలైంది. అదికూడా ప్రెజెంట్ ప్రభాస్, అల్లు అర్జున్ లతో సినిమాలు నిర్మిస్తున్న టిసిరీస్ భూషణ్ కుమార్ తో అని తెలుస్తోంది.
రీసెంట్ గా ఎన్టీఆర్30 లాంచ్ కి ముంబై నుండి స్పెషల్ గెస్ట్ గా విచ్చేసిన భూషణ్ కుమార్.. ప్రభాస్, బన్నీల తర్వాత ఎన్టీఆర్ తో సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నాడని, త్వరలోనే ఎన్టీఆర్ తో సినిమా అనౌన్స్ చేయనున్నాడని సమాచారం. ఎందుకంటే.. భూషణ్ కుమార్ ఏ ఈవెంట్ కి అంత ఈజీగా రాడు. అలాంటిది ఎన్టీఆర్ మూవీ లాంచ్ కే వచ్చాడంటే.. ఒకటి ఫ్యూచర్ లో ఎన్టీఆర్ తో సినిమా నిర్మించడానికి అయినా వచ్చి ఉండాలి. లేదా ఎన్టీఆర్-కొరటాల మూవీకి సంబంధించి హిందీ రైట్స్ అయినా తీసుకొని ఉండాలంటూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఈ రెండింట్లో ఏది జరిగినా.. ఎన్టీఆర్ కి బాలీవుడ్ లో మార్కెట్ పెరగడం ఖాయమనే చెప్పాలి. త్వరలోనే భూషణ్ కుమార్ ఏదైనా గుడ్ న్యూస్ వినిపిస్తారేమో చూడాలి. మరి ఎన్టీఆర్30పై మీ అంచనాలు ఎలా ఉన్నాయో కామెంట్స్ లో తెలపండి.
Bhushan Kumar x Jr. NTR 😍
A mass collaboration indeed if happens! 🔥🔥🔥#BhushanKumar#JrNTR #NTR30 pic.twitter.com/hMym1qx6Iq
— maadalaadlahere (@maadalaadlahere) March 24, 2023