పాన్ ఇండియా స్టార్డమ్ వచ్చాక హీరోల నుండి చకచకా సినిమాలు వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటారు. కానీ.. పాన్ ఇండియా సినిమాలు కదా.. హీరోలు ప్రతి విషయంలో జాగ్రత్త పడుతుంటారు. ఎందుకంటే.. వచ్చిన పాన్ ఇండియా స్టేటస్ ని కాపాడుకోవాలని, ఫ్యాన్స్ అంచనాలకు తగ్గకుండా ఉండేలా ప్లాన్ చేస్తుంటారు. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ అదే పనిలో ఉన్నాడు.