‘2012, మే11’ ఆ రోజు పవన్ అభిమానులు పండగ జరుపుకున్న రోజు. వరుస పరాజయాలు చవిచూస్తున్న పవన్‌కు మంచి కిక్కిచ్చిన రోజు. అదే ‘గబ్బర్‌సింగ్’ రిలీజైన రోజు. ‘అరె వో గబ్బర్‌సింగ్‌కి ఫౌజియో ఉటా బందూక్ లగా నిషానా’ అన్న ఈ డైలాగ్‌కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో అందరికీ తెలుసు. పేరుకు ‘సల్మాన్‌ఖాన్’ సినిమా ‘దబంగ్’ నుంచి రీమేక్ చేసిందే అయినా.. డైరెక్ట్ సినిమాకు మించి క్రేజ్ తీసుకొచ్చింది. పవన్ 50వ పుట్టినరోజు సందర్భంగా అభిమానుల కోసం నిర్మాత, పవన్ కల్యాణ్ భక్తుడు బండ్ల గణేష్ ఒక బంపర్ ఆఫర్‌తో ప్లాన్ చేశాడు.
2012, మే 11న జరుపుకున్న అదే పండుగ మరొకసారి చేసుకుందామంటూ బండ్ల గణేష్, పవన్ అభిమానులకు ఆఫర్ ఇచ్చాడు. సెప్టెంబర్ 2న మీ ఊరిలో థియేటర్ బుక్ చేసుకోండి సినిమాకి పర్మిష్ నేనిస్తానంటూ బండ్లన్న అభిమానులకు క్రేజీ ఆఫర్ ఇచ్చాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పెద్ద నగరాలు, పట్టణాల్లో మొత్తం 100 షోలు ప్లాన్ చేశాడు బండ్ల గణేష్. ట్విట్టర్ వేదికగా ఇక పవన్ అభిమానులు మా దగ్గర అంటే మా దగ్గర వేయించండి అంటూ రిక్వెస్ట్‌లు పెడుతున్నారు. కొందరికి బండ్ల గణేష్ మీరు టికెట్లు బుక్ చేసుకోండి షో నేను వేయిస్తానంటూ హామీలు ఇచ్చేస్తున్నాడు.
పవన్ బర్త్‌డే సందర్భంగా తెలుగురాష్ట్రాల్లో గబ్బర్‌సింగ్ సినిమా వంద షోలు వేస్తున్నాం. మన దేవుడి పుట్టినరోజుని ఘనంగా జరుపుకుందాం. జై పవర్‌స్టార్ జై దేవర అంటూ బండ్ల గణేష్ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.
100 Shows in Telugu states September 2 Boss birthday special please watch Gabbar Singh and theatres we celebrate our God birthday Jai power Star Jai davara 🙏 https://t.co/X6u0cXwk76
— BANDLA GANESH. (@ganeshbandla) August 27, 2021