తన అంద చందాలతో ప్రేక్షకుల మదిని దోచిన బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగి ఇప్పుడు గ్లోబల్ నటిగా దూసుకుపోతున్నారు. 2000 సంవత్సరంలో విశ్వ సుందరిగా కిరీటం దక్కించుకున్నది ప్రియాంక చోప్రా. ప్రస్తుతం పలు హాలీవుడ్ ప్రాజెక్టుల్లో నటిస్తున్నది. ఇటీవలె సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో ఇంగ్లీష్ వెర్షన్ లో నటించారు. దీని ప్రమోషన్ లో భాగంగా ఫస్ట్ డేట్ లో శృంగారం గురించి ఆశ్ఛర్యకరమైన వ్యాఖ్యలు చేశారు.

పెళ్లికి ముందు ప్రియాంక చోప్రా చాలా మందితో డేటింగ్ చేసినట్లు చెప్పుకొచ్చింది. కానీ ఆ బందాలేవీ నిలకడగా నిలవలేదని ఒక రిలేషన్ నుంచి మరొక రిలేషన్ కి వెంట వెంటనే మారానని తెలిపింది. ఇండస్ట్రీలోని గొప్ప వ్యక్తులతో డేటింగ్ చేశానని కానీ ఆ బంధాలు విషాదంగా ముగిసాయని ప్రియాంక చోప్రా వెల్లడించింది.
ప్రియాంక చోప్రా అమెరికా గాయకుడు, నటుడు నిక్ జోనస్ తో ప్రేమాయణం కొనసాగించింది. కొంత కాలం పాటు డేటింగ్ చేసిన వీరిద్దరు పెద్దలను ఒప్పించి 2018లో పెళ్లి చేసుకున్నారు. నిక్ జోనస్ ఆమె కంటే 10ఏళ్లు చిన్నవాడు. ప్రియాంక చోప్రా గతేడాది సరోగసి విధానంలో ఒక పాపకు జన్మనిచ్చింది. దీంతో ఆమె గ్లోబల్ హీరోయిన్ గా చెలామణి అవుతోంది. ఇటీవల సిటాడెల్ తో ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ ప్రపంచ సుందరి ఆ వెబ్ సిరీస్ లో ఎంతో బోల్డ్ గా నటించింది. శృంగార సన్నివేశాల్లో నటించేటపుడు కాస్త ఇబ్బంది పడ్డానని ప్రియాంక చెప్పుకొచ్చారు.
ఇటీవల ఆమె పాల్గొన్న ఓ ఇంటర్య్వూలో ఫస్ట్ డేట్ లోనే మీరు శృంగారానికి అంగీకరిస్తారా అని అడగగా వెంటనే ఆమె షాకింగ్ విషయాలు చెప్పింది. ఫస్ట్ డేట్ లోనే శృంగారానికి ఒప్పుకుంటాను. దీనివల్ల ఒకరిపై ఒకరికి నమ్మకం ఏర్పడుతుంది. ఫస్ట్ టైం కలయికలో అతను ఎంతటి రసికుడో.. భవిష్యత్ లో మనతో ఎలా ఉంటాడో అనే విషయాలు తెలుస్తాయంటూ తన మనసులోని భావాలను బయటపెట్టింది. ప్రియాంక ఫస్ట్ డేట్ శృంగారంపై చేసిన వ్యాఖ్యలపై మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.