ప్రకాశ్ రాజ్.. తెలుగు ప్రేక్షకులు పరిచయం అక్కర్లేదని పేరు. అనేక విభిన్నమైన పాత్రల్లో నటించి అందరిని ఆకట్టుకున్నారు. పాత్రలో కొంచెం విషయం ఉంటే చాలు.. ఆయన ఆ క్యారెక్టర్ ఓ రేంజ్ లో పండిస్తారు. ఎలాంటి పాత్రలోనైనా ఆయన జీవించే తీరు ప్రేక్షకులను ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అలాంటి ప్రకాశ్ రాజ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఓ ఆసక్తికరమైన విషయాన్ని గురించి ప్రస్తావించారు. “సరిలేరు నీకెవ్వరు” సినిమా విషయానికి సంబంధించి ఓ హాట్ కామెంట్ చేశాడు. మరి.. ప్రకాశ్ రాజ్ చేసిన ఆ.. ఆసక్తికరమైన కామెంట్ ఏమిటో ఇప్పుదు తెలుసుకుందాం…
సూపర్ స్టార్ మహేష్ బాబు.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా “సరిలేరు నీకెవ్వరు“.ఈ సినిమాలో మహేష్ బాబు.. ఫస్ట్ టైమ్ ఒక ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో నటించి..అందరిని మెప్పించాడు. ఇదే సినిమాలో ప్రతి నాయకుడి పాత్రలో ప్రకాశ్ రాజ్ నటించారు. ఈసినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూలు సాధించింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రకాశ్ రాజ్.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం షేర్ చేసుకున్నాడు. ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ.. “ఏ ఆర్టిస్టుకైనా ఒక్కోసారి నచ్చనిపాత్రలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి పాత్రల్లో ఒకటి..సరిలేరు నీకెవ్వరు సినిమాలో చేశాను. ఆ సినిమాలో అబద్ధాలాడే ఒక రాజకీయనాయకుడి పాత్ర. దానిని నేను అయిష్టంగానే చేశాను. కొన్ని సంఘటనలు.. మన నిర్ణయాలతో అభిప్రాయాలతో పనిలేకుండా అలా జరిగిపోతుంటాయి.
మహేశ్ బాబు హీరోగా చేసిన ఆ సినిమాలో నేను అలాంటి పాత్రను చేయడం అసంతృప్తిగా అనిపించినా, ఆయన నిర్మించిన ‘మేజర్’ సినిమాలోని పాత్ర నాకు సంతృప్తినిచ్చింది. నా కెరియర్లో ‘ఆకాశమంత’ .. ‘బొమ్మరిల్లు’ సినిమాలు నాకు చాలా సంతోషాన్ని కలిగించాయి” అని చెప్పుకొచ్చారు. మరి..ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి:Jr NTR: భార్యకి ఖరీదైన ఫామ్ హౌస్ ని గిఫ్ట్ ఇచ్చిన ఎన్టీఆర్
ఇదీ చదవండి: ఆ టైటిల్ ను రిజెక్ట్ చేసిన బాలయ్య.. ఆలోచనలో పడ్డ అనిల్ రావిపూడి!