సినిమా ఇండస్ట్రీలో పనితనంతో పాటు లక్ కూడా ఉండాలి. కొన్ని సందర్భాల్లో కేవలం అదృష్టం మాత్రమే పని చేస్తుంది. ఇప్పుడు దర్శక, నటుడు ప్రదీప్ రంగనాథన్ విషయంలోనూ అదే జరిగింది. అదృష్టం ఆయన్ని వెతుక్కుంటూ వచ్చింది.
‘లవ్ టుడే’ సినిమాతో తమిళంతో పాటు సౌత్ మొత్తం మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు దర్శకుడు, హీరో ప్రదీప్ రంగనాథన్. షార్ట్ ఫిల్మ్‌లతో కెరీర్ స్టార్ట్ చేసిన అతడు దర్శకుడిగా మారాడు. ఆ వెంటనే హీరో అయ్యాడు. రెండు సినిమాలకే పిచ్చ పాపులారిటీ తెచ్చుకున్నాడు. దర్శకుడిగా ‘కోమాలి’ సినిమా ప్రదీప్‌కు ఓ బ్రేక్ ఇచ్చింది. తర్వాత తానే దర్శకత్వం వహిస్తూ.. హీరోగా నటించిన ‘లవ్ టుడే’ సినిమా దర్శకుడిగా మరో మెట్టు పెంచటమే కాదు.. హీరోగా ఓ బ్రేక్ ఇచ్చింది. ఇప్పుడు ప్రదీప్ ఏ సినిమా తీయబోతున్నారా? అన్న కుతూహలం ప్రేక్షకుల్లో ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ప్రదీప్ తర్వాత సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ వచ్చింది.
ప్రదీప్.. తన తర్వాతి సినిమా విగ్నేష్ శివన్ దర్శకత్వంలో చేయబోతున్నారట. ఈ సినిమాకు లవ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ‘ఎల్ఐసీ’ అన్న పేరు కూడా ఖరారు చేశారంట. ఆర్కేఎఫ్ఐ నిర్మాణ సంస్థ ఈ సినిమాను తెరకెక్కించనుందని సమాచారం. ఈ సినిమాకు మొదట శివకార్తికేయన్‌ను హీరోగా అనుకున్నారంట. కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల శివకార్తికేయన్ ఆ సినిమానుంచి తప్పుకున్నారు. దీంతో ఆ ఛాన్స్ ప్రదీప్‌ను వరించింది. ఈ సినిమా కోసం ప్రదీప్‌ను సంప్రదించగా .. ఆయన సినిమాలో నటించడానికి సుముఖత వ్యక్తం చేశారంట. ఇక, ఈ సినిమా లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కనుందని సమాచారం.
అతి త్వరలో సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా కోసం ఇద్దరి అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉన్నారు. కాగా, విగ్నేష్ శివన్ ‘నానుమ్ రౌడీదా’ సినిమాతో డైరెక్టర్‌గా మారారు. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. తర్వాత వచ్చిన ‘తానా సేంద కూటమ్’ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే, ‘కేఆర్కే’ సినిమాతో తొలి ప్లాప్‌ను అందుకున్నారు. ఇప్పుడు ఎల్ఐసీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరి, ప్రదీప్, విగ్నేష్ కాంబోలో రాబోతున్న ‘ఎల్ఐసీ’ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.