యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కొత్త సినిమా నేడు సెట్స్ పైకి వెళ్ళింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ పూజ కార్యక్రమం నేడు హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో జరిగింది. దీనికి బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ హాజరయ్యారు. ఇక ఎన్నో రోజుల నుంచి నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రభాస్ సినిమా వస్తుందంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక ఎట్టకేలకు ఇన్ని రోజుల తరువాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడంతో ప్రభాస్ అభిమానులు ఎగిరి గంతేస్తున్నారు. పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతున్న ఈ మూవీపై అంచనాలు మాత్రం భారీగా పెరిగిపోతున్నాయి.
దీంతో భారీ బడ్జెట్ తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు నిర్మాతలు. ఇక బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గొప్ప నటుడిగా గుర్తింపు పొందారు ప్రభాస్. అప్పట్లో ఈ సినిమా సృష్టించిన విజయం అంతా ఇంతా కాదనే ఇప్పాలి. ఈ మూవీ దెబ్బకు ప్రభాస్ హాలీవుడ్ రేంజ్ కు ఎదిగిపోయారు. ఈ చిత్రం అనంతరం సాహో లాంటి మూవీని చేసి హాలీవుడ్ నటుడిగా పేరు ప్రఖ్యాతలు పొందారు. ప్రస్తుతం చాలా సినిమాలకు సైన్ చేసిన ప్రభాస్ వరుసల చిత్రాలను లైన్ లో పెట్టుకుంటున్నారు. ఈ సినిమాకు సంబందించిన విషయాలన్నీ అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా నాగ్ అశ్విన్ తెలియజేస్తున్నాడు.
హాలివూడ్ స్థాయిలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నామని గతంలో చాలా సార్లు తెలిపారు. ఇక ఇందులో ప్రభాస్ కు జోడిగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకోణె నటిస్తోందని తెలుస్తోంది. ఇందులో చాలా మంది బాలీవుడ్ యాక్టర్స్ ఇందులో నటించనున్నారట. ఈ మూవీని భారీ బడ్జెట్ తో వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మించబోతోంది. దీంతో పాటు ప్రభాస్ ప్రస్తుతం ఆదిపురుష్, సలార్, రాధేశ్యామ్ వంటి చిత్రాలు చేస్తూ దూకుడు పెంచుతున్నారు. మరి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.