సినిమా బడ్జెట్ దాదాపు 500 కోట్లు కాగా.. బడ్జెట్ 90 శాతం థియట్రికల్, ఓటీటీ హక్కుల రూపంలో కొట్టేసింది. సినిమా హిట్టయితే నిర్మాతలకు కాసుల సునామీ వచ్చినట్లే.
ఆదిపురుష్ సినిమా విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే థియట్రికల్ రైట్స్ విషయంలో ఆదిపురుష్ పాత రికార్డులను తుడిచిపెట్టింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి ఈ సినిమా థియట్రికల్ రైట్స్ 175 కోట్ల రూపాయలకు అమ్ముడయినట్లు సమాచారం. ఈ చిత్ర హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తీసుకుందని టాక్. మొత్తం దేశ వ్యాప్త థియట్రికల్ రైట్స్ విషయంలోనూ ఆదిపురుష్ ముందు వరుసలో నిలిచింది. ఇప్పుడు ఓటీటీ రైట్స్ విషయంలోనూ ఈ సినిమా సంచలనం సృష్టిస్తోంది. చిత్ర నిర్మాతలు ఓటీటీ రైట్స్‌ను భారీ మొత్తానికి విక్రయించారు.
ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ ఆదిపురుష్ ఓటీటీ హక్కులను 250 కోట్లకు కొన్నదని సమాచారం. సినిమా బడ్జెట్ దాదాపు 500 కోట్లు కాగా.. బడ్జెట్ 90 శాతం థియట్రికల్, ఓటీటీ హక్కుల రూపంలో కొట్టేసింది. సినిమా హిట్టయితే నిర్మాతలకు కాసుల సునామీ వచ్చినట్లే. కాగా, నిన్న తిరుపతిలో ఆదిపురుష్ ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్‌కు లక్షల మంది ఫ్యాన్స్ హాజరయ్యారు. వర్షం పడుతున్నా వెనక్కు తగ్గకుండా తమ హీరో కోసం ఉండిపోయారు. నిన్న జరిగిన ఈవెంట్‌లో ప్రభాస్ తన పెళ్లి గురించి ప్రస్తావన తెచ్చారు. తాను ఎప్పుడు పెళ్లి చేసుకున్నా..
తిరుపతిలోనే చేసుకుంటానని క్లారిటీ ఇచ్చారు. ఇక, ఆదిపురుష్ సినిమా ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా ఉన్న సగటు ప్రేక్షకుడు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాడు. ఈ సినిమా బాహుబలి రికార్డులను బద్దలు కొడుతుందని దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. అయితే, ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాల్సిందే. మరి, విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తున్న ఆదిపురుష్ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.