పంజాబీ బ్యూటీ పూనమ్ కౌర్ తెలుగులో కొన్ని సినిమాలే చేసినా.. తెలుగు అభిమానులతో మంచి అనుబంధం ఉంది. హీరోయిన్ మెటీరియల్ అయినా.. ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు అని టాక్ కూడా ఉంది. అంతేకాకుండా ప్రతిసారి పూనమ్ కౌర్ విషయాన్ని పవన్ కల్యాణ్‌కు లింకు చేసి ఆరోపణలు చేస్తుంటారు. అది రాజకీయంగా, సినిమా పరంగా ఎంతగానో దుమారం రేపిన విషయం తెలిసిందే. తాజాగా ఒక వైసీపీ ఎమ్మెల్యే సైతం పబ్లిక్ పవన్- పూనమ్ కౌర్ మధ్య ఏదో ఉంది అన్నట్లు ఆరోపించిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి: లైవ్‌లో దీపక్ చాహర్ ప్రపోజల్.. వెనుకుండి చక్రం తిప్పిన ఎంఎస్ ధోనీ
ఇదిలా ఉంటే ఇప్పుడు పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ ఒకటి వైరల్‌గా మారింది. #PKLOVE అంటూ తన ఫొటోలు కొన్ని అప్‌లోడ్ చేసింది. పవన్ కల్యాణ్‌ను సంబోదించేందుకు అందరూ సోషల్ మీడియాలో PK అని వాడుతుంటారు. ఇప్పుడు ఆమె ట్వీట్‌పై పెద్ద చర్చ మొదలైంది. వివరణ లేకుండా ఇలా పీకే లవ్ అంటూ పెట్టడంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొందరు అర్థంకాకుండా.. వివరణ లేకుండా ఏంటి ఆ ట్వీట్ అంటూ మండిపడుతున్నారు. పూనమ్ కౌర్ పేరుకు షార్ట్ ఫామ్ కూడా PKనే కాబట్టి ఆ విధంగా పెట్టిందనే భావన కూడా ఉంది. పోస్టులో ఆమె ఫొటోలే ఉన్నాయి కాబట్టి.. సెల్ఫ్ పేరుతో ఆ హ్యాష్ ట్యాగ్ వాడి ఉండచ్చని కొందరు అభిప్రాయాలు వ్యక్త పరుస్తున్నారు. మరి, పూనమ్ ఏ ఉద్దేశంతో పెట్టిందో ఆమె వివరిస్తే గానీ.. ఒక క్లారిటీ వచ్చేలా లేదు.
#pklove pic.twitter.com/SsnBORfjLW
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) October 7, 2021