ఈమె తెలుగు హీరోయిన్. సైడ్ క్యారెక్టర్స్ కూడా చాలానే చేసింది. అదే టైంలో కాంట్రవర్సీలకు కేరాఫ్ గా మారిపోయింది. ఎవరో గుర్తొచ్చిందా?
హీరోయిన్ అనగానే.. అయితే సినిమాలు చేస్తారు లేదంటే సైలెంట్ గా ఉంటారు. చాలామంది భామల విషయంలో జరిగేది ఇదే. కానీ కొందరు మాత్రం.. యాక్టింగ్ సంగతి అటుంచితే వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అవుతుంటారు. మూవీస్ ఏం చేయకపోయినా సరే ఏదో ఒకటి మాట్లాడి, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటారు. పైన కనిపిస్తున్న హీరోయిన్ కూడా సేమ్ అలాంటి ఆమెనే. దాదాపు 16 ఏళ్ల నుంచి తెలుగులో నటిస్తున్న ఆమె ఎవరో గుర్తుపట్టారా? లేదా చెప్పేయమంటారా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. టాలీవుడ్ హీరోయిన్లలో పెద్దగా తెలుగమ్మాయిలు ఉండరు. ఉన్నోళ్లలో కొందరిని చూస్తే.. అరే నిండుగా ఉన్న తెలుగందం అనుకుంటాం. కట్ చేస్తే ఆమెది దిల్లీనో, పంజాబో అయ్యుంటుంది. పైన ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ పేరు పూనమ్ కౌర్. హైదరాబాద్ లోనే పుట్టి పెరిగింది. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ పూర్తి చేసిన తర్వాత తేజ డైరెక్షన్ లో ఓ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది. కానీ అది ఎందుకో సెట్ కాలేదు. అయితేనేం తేజ తీసిన ‘ఓ విచిత్రం’లో హీరోయిన్ గా చేసింది. కానీ ఫస్ట్ ఫస్ట్ ‘మాయాజాలం’ మూవీ రిలీజైంది.
అలా 2006లో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన పూనమ్ కౌర్.. ఆ తర్వాత మాత్రం సహాయపాత్రలు ఎక్కువగా చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది వరకు సినిమాలు చేస్తూనే ఉంది. అదే టైంలో ఓ హీరో విషయమై ఈమె ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో ఉంటూనే ఉంది. కొన్నాళ్ల క్రితం రాహుల్ గాంధీతో కలిసి పాదయాత్రలో పాల్గొన్న పూనమ్.. రాజకీయాల్లోకి వచ్చేలా కనిపిస్తోంది. ‘మిస్ తెలంగాణ’ ఈవెంట్ కు బ్రాండ్ అంబాసిడర్ గానూ చేసిన ఈ బ్యూటీ.. అప్పుడప్పుడు కాంట్రవర్సీ ట్వీట్స్, స్టేట్ మెంట్స్ పాస్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఆమె చిన్నప్పటి పిక్ వైరల్ అయింది. మరి ఈమె చైల్డ్ హుడ్ పిక్ చూసి మీలో ఎంతమంది గుర్తుపట్టారు? కింద కామెంట్ చేయండి.