Poonam Kaur: సినీ ఇండస్ట్రీలో సినిమా వార్తల్లో కంటే వివాదాల్లో ఎక్కువుగా వినిపించే పేరు.. పూనమ్ కౌర్. 15 ఏళ్ళ క్రితం ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘మాయాజాలం’ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలో అడుగు పెట్టిన పూనమ్.. ‘ఒక విచిత్రం’, ‘నిక్కి అండ్ నీరజ్’ సహా పలు సినిమాలు చేసింది. దాదాపు నాలుగేళ్ళ తర్వాత ఈ మధ్యనే నాతిచరామి అనే సినిమాతో మెరిసింది పూనమ్.
వివాదాలకు కేంద్రంగా మారిన పూనమ్.. ఒక్కోసారి వివాదాస్పద ట్వీట్లు చేయడమే కాదు.. వాటిని డెలిట్ చేసి కూడా చర్చలకు తెరలేపూతుంది. ఆమె చేసిన ట్వీట్లు వివాదం అయ్యాక.. మళ్లీ కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉండటం.. మరో తేనెతుట్టెను కదపడం కామన్. గత కొంత కాలంగా సైలెంట్‌గా ఉన్న పూనమ్.. మళ్లీ యాక్టివేట్ అయ్యింది. ఈసారి మహిళలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా గొంతెత్తింది.
ఆడవారి వస్త్రధారణపై విమర్శించే వారే అధికం. ఈ తరుణంలో ఆడవారి దుస్తులపై మాట్లాడే వారికి క్యూట్ బ్యూటీ పూనమ్ కౌర్ చెంపచెళ్లుమనే సమాధానం చెప్పింది. యువతులు, మహిళలు వేసుకునే దుస్తుల మూలంగానే వారిపై అత్యాచారాలు జరుగుతున్నాయిన చాలా మంది కామెంట్ చేస్తున్న వేళ.. పూనమ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.
“నేను బురఖా వేసుకుంటా.. చీరకట్టుకుంటా.. బీచ్ లో బికినీ వేసుకుంటా.. మీకు లిమిట్స్ క్రాస్ చేసే హక్కు లేదు. నాకు కంఫర్ట్ గా ఉన్న దుస్తులనే నేను ధరిస్తాను” అని గట్టిగా నొక్కిచెప్పింది. అందునా.. అత్యాచారాలకు గురైన చాలా మంది మహిళలు నిండైన దుస్తులు ధరించిన వారేనని చురకలు అంటించింది. ఈ మేరకు ఇన్స్టాలో పోస్ట్ పెట్టింది.. పూనమ్ కౌర్.
ఇదీ చదవండి: Pranitha: కూతుర్ని చిన్ని కృష్ణుడిలా అలంకరించిన హీరోయిన్ ప్రణిత.. ఫోటోస్ వైరల్..
ఇదీ చదవండి: ఉపాసన నుదుటిపై బొట్టు పెట్టిన రామ్ చరణ్! ఫొటోలు వైరల్..