సినీ ఇండస్ట్రీలో సూపర్ ఫామ్ కొనసాగిస్తున్న స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే. ప్రస్తుతం చేతినిండా స్టార్ హీరోల సినిమాలతో బిజీగా ఉంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన నటించిన ‘రాధే శ్యామ్‘ మూవీ మార్చి 11న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదలకు సిద్ధమైంది. రిలీజ్ దగ్గరపడటంతో ప్రమోషన్స్ ముమ్మరంగా చేస్తోంది చిత్రబృందం.
ఇక రాధేశ్యామ్ ప్రమోషన్స్ లో చురుకుగా పాల్గొంటున్న పూజా హెగ్డే.. సినిమాకి సంబంధించి చాలా విషయాలను మీడియాతో షేర్ చేసుకుంటోంది. ఇటీవలే సినిమా మేకింగ్ టైంలో జరిగిన ఫన్నీ, సీరియస్ విషయాలను చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో పూజా మాట్లాడుతూ.. రాధేశ్యామ్ డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ సినిమా దాదాపుగా ఇటలీ నేపథ్యంలోనే సాగుతుంది. షూటింగ్ కూడా అక్కడే చేశారు.ఇక సినిమాలో ప్రేరణ పాత్ర చేసిన పూజా.. పాత్రను బాగా అర్థం చేసుకొని నటించానని, అందుకే ఎమోషనల్ సీన్స్ లో తాను గ్లిజరిన్ అవసరం లేకుండా ఏడ్చానని చెప్పింది. హిందీ, తెలుగు వెర్షన్స్ ఏకకాలంలో షూట్ చేసేసరికి ఒకటి అయిపోగానే మళ్లీ ఇంకో భాషలో సీన్ చేయాల్సి వచ్చేది. ఇలాంటి పరిస్థితిలో చాలా టేక్స్ తీసుకున్నానని.. ఈ విధంగా ఎక్కువ టేక్స్ కారణంగా డైరెక్టర్ తనను చాలా ఏడిపించాడని సరదాగా చెప్పేసి నవ్వేసింది. ప్రస్తుతం పూజా మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి పూజా హెగ్డే పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.