ఈ మధ్యకాలంలో స్టార్డమ్ అందుకున్న హీరోలు, హీరోయిన్లు, దర్శకులు నిర్మాణ రంగంలో అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. హిట్స్, ప్లాప్స్ పక్కన పెడితే.. లిమిటెడ్ బడ్జెట్ లో కొత్త దర్శకులను, కొత్త కథలను ప్రోత్సహిస్తూ సినిమాలు నిర్మిస్తున్నారు. అయితే.. దక్షిణాది స్టార్ హీరోయిన్ నయనతార కొన్నేళ్ల క్రితమే తన ప్రియుడు, దర్శకుడు విఘ్నేష్ శివన్ తో కలిసి ‘రౌడీ పిక్చర్స్‘ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించి సినిమాలు నిర్మిస్తోంది.
ఇక రౌడీ పిక్చర్ బ్యానర్ పై నయనతార, విఘ్నేష్ ఇద్దరూ పెబుల్స్, రాకీ లాంటి సినిమాలు నిర్మించారు. ప్రస్తుతం కొన్ని సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ క్రమంలో ఓ షాకింగ్ న్యూస్ బయటికి వచ్చింది. తాజాగా చెన్నైలో రౌడీ పిక్చర్స్ ప్రొడక్షన్ హౌస్ పై కేసు నమోదైనట్లు సమాచారం. కన్నన్ అనే ఓ సామాజిక కార్యకర్త.. రౌడీ పిక్చర్స్ అనే పేరు రౌడీ సంస్కృతిని ప్రోత్సహించేలా ఉందని, వెంటనే దానిని నిషేధించాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది.అదేవిధంగా ప్రొడక్షన్ హౌస్ నిర్వహిస్తున్న నయనతార, విఘ్నేష్ శివన్ లను కూడా అరెస్ట్ చేయాలని పిటిషనర్ పోలీసులను కోరినట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. ఈ విషయం పై నయనతార, విఘ్నేష్ ఇప్పటివరకు స్పందించలేదని ఇండస్ట్రీ టాక్. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం నయనతార, విఘ్నేష్ ఇద్దరూ కూడా చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవలే నయన్ బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, మెగాస్టార్ చిరంజీవి సినిమాలలో ఓకే అయింది. మరోవైపు విఘ్నేష్.. తలా అజిత్ తో ఓ సినిమా ఓకే చేసుకున్నాడు. ఇలాంటి సమయంలో ఇలా జరగడంపై ఫ్యాన్స్ నిరాశపడుతున్నారు. మరి ఈ విషయం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.